Mumbai Indians: ముంబై జట్టులోకి క్రిస్ జోర్డాన్

ఐపీఎల్ 2023 సీజన్లో ముంబై ఇండియన్స్ ప్రదర్శన అంతంతమాత్రమే. మొత్తం 7 మ్యాచ్‌లు ఆడిన ఆ జట్టు ఇప్పటి వరకు 3 మ్యాచ్‌ల్లో మాత్రమే విజయం సాధించింది.

Mumbai Indians: ఐపీఎల్ 2023 సీజన్లో ముంబై ఇండియన్స్ ప్రదర్శన అంతంతమాత్రమే. మొత్తం 7 మ్యాచ్‌లు ఆడిన ఆ జట్టు ఇప్పటి వరకు 3 మ్యాచ్‌ల్లో మాత్రమే విజయం సాధించింది. ప్రస్తుతం రోహిత్ శర్మ నేతృత్వంలోని ముంబై ఇండియన్స్ పాయింట్ల పట్టికలో 9వ స్థానంలో ఉంది.

1000వ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ రాజస్థాన్ రాయల్స్‌తో ఈరోజు రాత్రి 7:30 గంటలకు తలపడనుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ మ్యాచ్‌కు ముందు ముంబై ఇండియన్స్‌కు ఓ శుభవార్త వెలువడింది. ఇంగ్లండ్ క్రికెట్ జట్టు ఫాస్ట్ బౌలర్ క్రిస్ జోర్డాన్ ముంబై ఇండియన్స్‌తో చేరాడు. నిజానికి IPL 2023 ప్రారంభానికి ముందు ముంబై ఇండియన్స్‌కు జస్ప్రీత్ బుమ్రా రూపంలో పెద్ద దెబ్బ ఎదురైంది. గాయం కారణంగా బుమ్రా సీజన్ మొత్తానికి దూరమయ్యాడు. దీని తరువాత ఫాస్ట్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ కేవలం 2 మ్యాచ్‌లు మాత్రమే ఆడి గాయం కారణంగా దూరమయ్యాడు. ఈ పరిస్థితిలో ముంబై ఇండియన్స్ క్రిస్ జోర్డాన్‌ను జట్టులోకి తీసుకోవడం ప్లస్ గానే భావించవచ్చు. .

డెత్ ఓవర్ల స్పెషలిస్ట్‌గా పరిగణించబడే క్రిస్ జోర్డాన్‌ను IPL 2023 వేలానికి ముందు చెన్నై సూపర్ కింగ్స్ విడుదల చేసింది. క్రిస్ జోర్డాన్ 2013 సంవత్సరంలో ఆస్ట్రేలియాతో జరిగిన ఇంగ్లండ్ క్రికెట్ జట్టు తరపున అరంగేట్రం చేసాడు.క్రిస్ జోర్డాన్ మొత్తం 87 T20 మ్యాచ్‌లు ఆడి 2623 పరుగులు సాధించడమే కాకుండా 96 వికెట్లు పడగొట్టాడు. క్రిస్ వన్డేల్లో 35 మ్యాచ్‌లు ఆడి 46 వికెట్లు, టెస్టు క్రికెట్‌లో 8 మ్యాచుల్లో 21 వికెట్లు పడగొట్టాడు. క్రిస్ జోర్డాన్ 2016 సంవత్సరంలో IPL అరంగేట్రం చేశాడు. అతను RCB, పంజాబ్ కింగ్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ మరియు చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఆడాడు. 28 ఐపీఎల్ మ్యాచ్‌ల్లో 27 వికెట్లు తీశాడు. అతని ఎకానమీ 9.32.

Read More: PS2: పీఎస్2లో జూనియర్ ఐశ్వర్యగా నటించిన ఈ చైల్డ్ ఆర్టిస్ట్ ఎవరో గుర్తుపట్టారా?