Howrah Express Derail: దేశంలో మరో ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుంది. జార్ఖండ్‌లో హౌరా-ముంబై ఎక్స్‌ప్రెస్.. గూడ్స్ రైలును ఢీకొనడంతో (Howrah Express Derail) సుమారు 5 బోగీలు పట్టాలు తప్పడంతో పాటు బోల్తా పడ్డాయి. ఈ ప్రమాదంలో 10 మందికి పైగా గాయపడగా, వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అయితే ఈ ప్రమాదంలో పలువురు మరణించినట్లు వార్తలు వస్తున్నాయి. జార్ఖండ్‌లోని చక్రధర్‌పూర్‌లో రాజ్‌ఖర్‌స్వాన్- బడాబాంబో మధ్య తెల్లవారుజామున 4.45 గంటలకు ప్రమాదం జరిగింది.
రైలు నెం. 12810 హౌరా-CSMT ఎక్స్‌ప్రెస్ వెళ్తుండగా చక్రధర్‌పూర్ సమీపంలో రాజ్‌ఖర్స్వాన్ వెస్ట్ ఔటర్- చక్రధర్‌పూర్ డివిజన్‌లోని బారాబంబు మధ్య పట్టాలు తప్పింది. పట్టాలు తప్పిన తర్వాత బోగీలు పక్కనే ఉన్న ట్రాక్‌పై నిలబడి ఉన్న గూడ్స్ రైలును ఢీకొన్నాయి. ప్రమాదం గురించి సమాచారం అందిన వెంటనే జీఆర్పీ, రైల్వే అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. రైల్వే వైద్య బృందం కూడా ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులకు ప్రథమ చికిత్స అందించారు.
Also Read: MLA Vivekananda : నిద్రావస్థలో నుండి బయటకు రండి – కాంగ్రెస్ సర్కార్ కు సలహా
క్షతగాత్రులను చక్రధర్‌పూర్‌లోని రైల్వే ఆస్పత్రికి తరలించారు. ప్రమాదాన్ని చక్రధర్‌పూర్ రైల్వే డివిజన్ సీనియర్ డీసీఎం ఆదిత్య కుమార్ చౌదరి ధృవీకరించారు. చక్రధర్‌పూర్ రైల్వే డివిజన్ నుండి రిలీఫ్ రైలు సంఘటనా స్థలానికి చేరుకుంది. అంబులెన్స్, పోలీసు బృందాలు సంఘటనా స్థలంలో ఉన్నాయి. ప్రమాదం గురించి సమాచారం అందిన వెంటనే సెరైకెలా డిప్యూటీ కమిషనర్ కూడా సంఘటనా స్థలానికి చేరుకున్నారు. రైలు టాటానగర్ నుండి బడాబాంబో దాటిన వెంటనే పెద్ద శబ్దంతో రైలు అకస్మాత్తుగా పట్టాలు తప్పిందని ప్రయాణికులు తెలిపారు.
ఈ ప్రమాదం తర్వాత హౌరా టిట్లాగఢ్‌తో సహా అనేక రైళ్లు రద్దు చేయబడ్డాయి. చక్రధర్‌పూర్‌లోని రైల్వే హాస్పిటల్‌తో పాటు, జంషెడ్‌పూర్‌లోని టీఎమ్‌హెచ్, మెడికల్ కాలేజీ, సదర్ హాస్పిటల్‌లను కూడా అప్రమత్తం చేశారు. సమాచారం ప్రకారం, హౌరా-ముంబై మెయిల్ ఎక్స్‌ప్రెస్ కొన్ని బోగీలు పట్టాలు తప్పడంతో పాటు సమీపంలో ఆగి ఉన్న గూడ్స్ రైలును ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ప్రయాణికులు గాయపడినట్లు రైల్వే అధికారులు ధృవీకరించారు. క్షతగాత్రులను చక్రధర్‌పూర్‌లోని రైల్వే ఆస్పత్రికి తరలించారు. ఘటనా స్థలంలో రైల్వే ఉన్నతాధికారులు ఉన్నారు.
We’re now on WhatsApp. Click to Join.
హెల్ప్‌లైన్ నంబర్స్
హౌరా-ముంబై మెయిల్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదం తర్వాత రైల్వే హెల్ప్‌లైన్ నంబర్‌ను విడుదల చేసింది.
- టాటానగర్: 06572290324
- చక్రధర్‌పూర్: 06587 238072
- రూర్కెలా: 06612501072, 06612500244
- హౌరా: 9433357920, 03326382217
- రాంచీ: 0651-27-87115
- HWH హెల్ప్ డెస్క్: 033-26382217, 9433357920
- SHM హెల్ప్ డెస్క్: 6295531471, 7595074427
- KGP హెల్ప్ డెస్క్: 03222-293764
- CSMT హెల్ప్‌లైన్ ఆటో నంబర్: 55993
- P&T: 022-22694040
- ముంబై: 022-22694040
- నాగ్‌పూర్: 7757912790