రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీ (Mukesh Ambani) సంపదలో అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ (Gautam Adani)ని వెనక్కి నెట్టేశారు. ప్రస్తుతం 84.3 బిలియన్ డాలర్ల సంపదతో అంబానీ ప్రపంచంలోనే సంపన్నుడైన భారతీయుడిగా అవతరించారు. గౌతమ్ అదానీ 83.9 బిలియన్ డాలర్ల సంపదతో అంబానీ తర్వాత స్థానానికి పడిపోయారు. ఈ మేరకు ఫోర్బ్స్ సంస్థ రియల్ టైమ్ బిలియనీర్స్ -2023 జాబితాను వెల్లడించింది.
రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఛైర్మన్ ముఖేష్ అంబానీ ఆసియా, భారతీయ అత్యంత ధనవంతుడిగా మారారు. ఫోర్బ్స్ రియల్ టైమ్ బిలియనీర్ల జాబితాలో ముకేశ్ అంబానీ 84.3 బిలియన్ డాలర్ల నికర సంపదతో ప్రపంచంలోని అత్యంత సంపన్నుల జాబితాలో 9వ స్థానానికి చేరుకున్నారు. అదే సమయంలో గౌతమ్ అదానీ 84.1 బిలియన్ డాలర్ల ఆస్తులతో 10వ స్థానానికి పడిపోయారు. అయితే, ఒక రోజు ముందుగానే అతను సంపన్నుల జాబితాలో 11వ స్థానానికి చేరిన విషయం తెలిసిందే.
Also Read: union-budget : కేంద్ర వార్షిక బడ్జెట్ 2023
అమెరికన్ ఆర్థిక పరిశోధన సంస్థ హిండెన్‌బర్గ్ నివేదిక తర్వాత అదానీ ఎంటర్‌ప్రైజెస్‌తో సహా అన్ని గ్రూప్ కంపెనీల షేర్లలో భారీ క్షీణత ఉంది. ఈ నివేదికలో అదానీ గ్రూప్ స్టాక్ మానిప్యులేషన్ ఆరోపణలు ఎదుర్కొంది. అదానీకి చెందిన 7 కంపెనీల షేర్లు 85 శాతం క్షీణతను నమోదు చేశాయి. దీని కారణంగా అదానీ గ్రూప్ నష్టం $ 72 బిలియన్లకు పెరిగింది. అయితే గౌతమ్ అదానీ గ్రూప్ తమ ఫ్లాగ్‌షిప్ కంపెనీకి చెందిన రూ.20,000 కోట్ల ఎఫ్‌పిఓ విజయవంతమవుతుందని విశ్వాసం వ్యక్తం చేసింది.
అదానీ గ్రూప్.. హిండెన్‌బర్గ్ నివేదికపై ఎలాంటి పరిశోధన జరగలేదని స్పష్టం చేసింది. హిండెన్‌బర్గ్ ఉద్దేశపూర్వకంగా ప్రజలను తప్పుదోవ పట్టించారని ఆయన అన్నారు. బుధవారం అదానీ ఎంటర్‌ప్రైజెస్ యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి రూ.5,985 కోట్లను సమీకరించింది. ఫోర్బ్స్ రియల్ టైమ్ బిలియనీర్ల జాబితా ప్రకారం.. బెర్నార్డ్ ఆర్నాల్ట్ టాప్ 10 సంపన్నుల జాబితాలో అగ్రస్థానంలో ఉన్నారు. రెండో స్థానంలో ఎలాన్ మస్క్, మూడో స్థానంలో జెఫ్ బెజోస్, నాలుగో స్థానంలో లారీ ఎలిసన్, ఐదో స్థానంలో వారెన్ బఫెట్, ఆరో స్థానంలో బిల్ గేట్స్, 7వ స్థానంలో కార్లోస్ స్లిమ్ హెలు అండ్ ఫ్యామిలీ, 8వ స్థానంలో లారీ పేజ్ ఉన్నారు. ఆ తర్వాత 9వ స్థానంలో ముఖేష్ అంబానీ పేరు ఉండగా, 10వ స్థానంలో గౌతమ్ అదానీ పేరు ఉంది.