మదర్ థెరీసా సేవలు శ్లాఘనీయం. ఆమె చేసిన సేవలు అమోఘం. ఆమె అమ్మ గా చిరస్మరణీయం అని రాష్ట్ర పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. మదర్ థెరీసా వర్ధంతి సందర్భంగా కాజీపేట ఫాతిమా చౌరస్తాలో మదర్ థెరీసా విగ్రహానికి పూలమాలవేసి పుష్పాంజలి ఘటించారు. ఎక్కడో ఆల్బెనియా లో పుట్టి, మన దేశానికి వచ్చి, మిషనరీ సంస్థను పెట్టి, ఇక్కడి ప్రజలకు అమ్మలా సేవలు చేసినట్లు మంత్రి తెలిపారు.
మదర్ థెరీసా స్ఫూర్తి తో మిషనరీ సంస్థలు కులమతాలకు అతీతంగా నిరుపేదలకు సాయం చేస్తున్నాయని, రానున్న రోజుల్లో వారి యొక్క సేవలను ఇంకా ప్రజల్లోకి తీసుకువెళ్లి ప్రజలకు మరిన్ని అవసరం అయ్యే పనులను చేపట్టాలని మంత్రి కోరారు. నిన్న జరిగినటువంటి వల్మీడి శ్రీ సీతారామ చంద్ర దేవాలయ పున: ప్రతిష్ఠాపన కార్యక్రమానికి బిషప్ రావడం పట్ల మంత్రి సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మదర్ థెరీసా విగ్రహ ప్రాంగణంలో మంత్రి మొక్కలు నాటారు.
Also Read: BRS Minister: కేసిఆర్ చేసేదే చెప్తాడు, చెప్పింది చేస్తాడు: మంత్రి వేముల