Mother Suicide: పరీక్షలో కొడుకు ఫెయిల్ అయ్యినందుకు తల్లి ఆత్మహత్య!

హైదరాబాద్ గాజులరామారంలో విషాదం నెలకొంది. తన కొడుకు ఫెయిల్ అయ్యినందుకు తల్లి ఆత్మహత్య చేసుకుంది.

Published By: HashtagU Telugu Desk
Crime

Crime

Mother Suicide: హైదరాబాద్‌లోని గాజులరామారం బాలాజీ నగర్ ఎన్‌క్లేవ్‌లో తన కొడుకు చార్టర్డ్ అకౌంటెన్సీ (సీఏ) పరీక్షలో ఉత్తీర్ణత సాధించకపోవడంతో మనస్తాపం చెందిన ఓ తల్లి ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పుష్పజ్యోతి(41) అనే గృహిణి బుధవారం తన ఇంట్లో సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం తరలించారు. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని జీడిమెట్ల పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. కొడుకు భవిష్యత్తు గురించి ఆందోళన చెందుతూ, జ్యోతి ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు ఆత్మహత్య చేసుకుంది. ఆమె భర్త ప్రైవేట్ ఉద్యోగి. ఈ దంపతులకు ఇద్దరు కుమారులు ఉండగా వారిలో ఒకరు ఇటీవల సీఏ పరీక్షకు హాజరయ్యారు. ఈ ఘటనతో గాజులరామారంలో విషాదం నెలకొంది.

Also Read: Sunny Leone: అయ్యో సన్నీ లియోన్.. వర్షాల్లో కొట్టుకుపోయిన 3 ఖరీదైన కార్లు!

  Last Updated: 10 Aug 2023, 01:01 PM IST