Padma Award Winners : పద్మశ్రీ అవార్డు గ్రహీతలకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త

పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్న గడ్డం సమ్మయ్య, దాసరి కొండప్పకు ప్రతీ నెల రూ. 25 వేల ప్రత్యేక పింఛన్ మంజూరు చేస్తూ జీవో జారీ చేశారు

  • Written By:
  • Publish Date - July 22, 2024 / 08:45 PM IST

తెలంగాణ ప్రభుత్వం (Telangana Govt) పద్మశ్రీ అవార్డు గ్రహీతలకు (Padma Award Winners) తీపి కబురు తెలిపింది. పద్మశ్రీ అవార్డు గ్రహీతలకు నెలకు రూ. 25 వేల పింఛన్ (Monthly Pension of 25,000) అందిస్తున్నట్లు జీవో జారీ విడుదల చేసింది. ఇటీవలే పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్న గడ్డం సమ్మయ్య, దాసరి కొండప్పకు ప్రతీ నెల రూ. 25 వేల ప్రత్యేక పింఛన్ మంజూరు చేస్తూ జీవో జారీ చేశారు. అంతేకాకుండా.. పద్మ విభూషన్, పద్మశ్రీ పురస్కార విజేతలకు సన్మాన కార్యక్రమంలో పద్మశ్రీ గ్రహీతలకు రూ. 25 వేల పెన్షన్ ఇస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు.

We’re now on WhatsApp. Click to Join.

ఈ క్రమంలో.. ఇచ్చిన మాటకు కట్టుబడి ఉత్తర్వులు జారీ చేశామని మంత్రి జూపల్లి పేర్కొన్నారు. కనుమరుగు అవుతున్న కళలు గుర్తించి, వాటిని భవిష్యత్తు తరాలకు అందించే కళాకారులను ప్రోత్సహించేందుకు సీఎం రేంవత్ రెడ్డి సారధ్యంలోని ప్రజా ప్రభుత్వం కృషి చేస్తుందని జూపల్లి తెలిపారు. భాష, సాంస్కృతిక శాఖ ద్వారా వీరికి పింఛన్ డబ్బులు నేరుగా వారి ఖతాల్లో జమ చేయనుందని తెలిపారు.

Read Also : Ponnam Prabhakar : రాజకీయాలకు అతీతంగా హైదరాబాద్ అభివృద్ధి చేసుకుందాం: మంత్రి పొన్నం

Follow us