AI Tools: టెక్నాలజీ రోజు రోజుకు ఎంతో అభివృద్ధి చెందుతుంది. అయితే. టెక్నాలజీని మంచి కంటే చెడుకే ఎక్కువగా వినియోగిస్తున్నారు. ఇప్పటికే డీప్ ఫేక్‌తో ప్రముఖుల వీడియోలు హల్ చల్ చేసిన ఘటనలు మనం చూసాం. అయితే.. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పెద్ద తలనొప్పిగా మారుతోంది. ఇటీవలే భారత క్రికెట్ పేసర్ మొహమ్మద్ షమీ, హైదరాబాద్‌కు చెందిన టెన్నిస్ స్టార్ సానియా మీర్జాలు రిలేషన్‌షిప్‌లో ఉన్నారా లేదా వీరు పెళ్లై చేసుకున్నారా అంటూ అనేక వార్తలు సంచలనంగా మారాయి. వీరిద్దరు కలిసి ఉన్న ఫోటోలు కొన్ని వైరల్ కావడంతో ఈ రూమర్లను ప్రేరేపించాయి. ఈ మధ్య ఒక కొత్త ఫోటో కూడా వైరల్ అయింది, ఇందులో షమీ , సానియా బీచ్‌లో ఒకరినొకరు హగ్ చేస్తూ కనిపిస్తున్నారు.
Jasprit Bumrah: టెస్టుల్లో 200 వికెట్లు పూర్తి చేసిన బుమ్రా!
అయితే.. ఈ వైరల్ ఫోటో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో వేలాది లైకులు, కామెంట్లను ఆకర్షించింది. కొంతమంది నెటిజన్లు ఫోటో అసలు నిజమేనా అని సందేహాలు వ్యక్తం చేయగా, మరికొంతమంది వారిని అభినందిస్తూ విషెస్ చెబుతున్నారు. అయితే, ఈ ఫోటో యొక్క ప్రామాణికత, ఫోటో యొక్క ప్రదేశం, పోస్ట్ చేసిన తేదీపై అనేక సందేహాలు వ్యక్తమయ్యాయి.
ఫాక్ట్ చెక్ ఫలితాలు
ఫాక్ట్ చెక్ నిర్వహించిన తరువాత, మొహమ్మద్ షమీ , సానియా మీర్జా వారి అధికారిక సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లపై ఈ ఫోటోను ఎవరూ పంచుకోలేదని ధృవీకరించబడింది. ఫోటోను సవివరంగా పరిశీలిస్తే, అది మార్ఫ్ చేయబడినదన, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ ఉపయోగించి సృష్టించబడిందని తేలింది. ఈ ఘటన ప్రజా ప్రముఖుల పేర్లు హాని చేసేలా రూపొందించిన నకిలీ కంటెంట్‌ను సృష్టించడంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ , డీప్‌ఫేక్ టెక్నాలజీల దుర్వినియోగం గురించి చర్చల్ని మరోసారి ముందు ఉంచింది. బీచ్ ఫోటోతో పాటు, షమీ, సానియాని ఒక వివాహ వేడుకలో చూపిస్తున్న ఇతర చిత్రాలు కూడా వాటి అంతిమంగా AI-generated (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా తయారు చేయబడిన)గా ఉండటం గమనార్హం.