Site icon HashtagU Telugu

kavitha : కేసీఆర్‌ను కలిసిన ఎమ్మెల్సీ కవిత

MLC Kavita who meet KCR

MLC Kavita who meet KCR

kavitha: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు బెయిల్ వచ్చిన తరువాత ఎమ్మెల్సీ కవిత ఈరోజు(గురువారం) తన తండ్రి, బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ని కలిశారు. హైదరాబాద్‌ నుంచి ఉదయాన్నే బయల్దేరిన ఆమె సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలో ఉన్న ఫాంహౌజ్‌కి చేరుకున్నారు. ఆమె వెంట భర్త అనిల్, కుమారుడు కూడా ఉన్నారు. ఆమెకు కేసీఆర్ కుటుంబ సభ్యులు ఆత్మీయ స్వాగతం పలికారు. కవితకు బెయిల్ రావడంపై కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. కేసీఆర్.. కవితను చూసిన వెంటనే ఆమెను హత్తుకున్నారు. ఈ సందర్భంగా ఇరువురు భావోద్వేగానికి లోనయ్యారు. అనంతరం ఆమె కేసీఆర్ పాదాలకు నమస్కరించారు.

కాగా, ఓ వైపు అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయంపాలవ్వడం, మరోవైపు కవిత అరెస్ట్, ఇంకోవైపు లోక్ సభ ఎన్నికల్లో సున్నా సీట్లకు పరిమితం కావడంతో బీఆర్ఎస్ శ్రేణులు నిరాశలో మునిగిపోయాయి. అయితే చాన్నాళ్ల తరువాత కేసీఆర్ ముఖంలో ఈరోజు ఉత్సాహం, సంతోషం కనిపించిందని ఆ పార్టీ నేతలు అంటున్నారు. కవితను అక్రమంగా నిర్బంధించారని చివరికి సత్యమే గెలిచిందని చెబుతున్నారు. కవిత రాకతో ఎర్రవెల్లిలోని కేసీఆర్ నివాసం కోలాహలంగా మారింది.

We’re now on WhatsApp. Click to Join.

ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. మంగళవారం రాత్రి బెయిల్‌పై విడుదలైన కవిత బుధవారం రాత్రి హైదరాబాద్‌కు చేరుకున్నారు.
ఐదున్నర నెలల తర్వాత తెలంగాణ గడ్డపై అడుగు పెట్టాడు. ఈ సందర్భంగా కవితకు సొంతగడ్డపై అపూర్వ స్వాగతం లభించింది.

Read Also: Vathu Tips: సంపదకు లోటు ఉండకూడదంటే ఈ వస్తువులు మీ ఇంట్లో ఉండాల్సిందే!