MLC Elections : తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్‌ విడుదల

ఫిబ్రవరి 3న వీటికి సంబంధించిన నోటిఫికేషన్‌ విడుదల చేయనున్నారు. నామినేషన్ల దాఖలుకు ఫిబ్ర‌వ‌రి పదో తేదీ వరకు గడువు ఉంది. 11వ తేదీన నామినేషన్ల పరిశీలన, 13వ తేదీ వరకు ఉపసంహరణ ఉంటుంది.

Published By: HashtagU Telugu Desk
Mlc Election Schedule Released In Telugu States

Mlc Election Schedule Released In Telugu States

MLC Elections : ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలకు షెడ్యూల్‌ విడుదలైంది. తెలంగాణలో రెండు ఉపాధ్యాయ, ఒక పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గానికి ఎన్నికల షెడ్యూల్‌ విడుదలైంది. ఏపీలో రెండు పట్టభద్రుల, ఒక ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గానికి షెడ్యూల్‌ను విడుదల చేశారు. ఫిబ్రవరి 3న వీటికి సంబంధించిన నోటిఫికేషన్‌ విడుదల చేయనున్నారు. నామినేషన్ల దాఖలుకు ఫిబ్ర‌వ‌రి పదో తేదీ వరకు గడువు ఉంది. 11వ తేదీన నామినేషన్ల పరిశీలన, 13వ తేదీ వరకు ఉపసంహరణ ఉంటుంది. ఫిబ్రవరి 27 పోలింగ్‌, మార్చి 3న ఓట్ల లెక్కింపు జరగనున్నది. ఇక, ఎన్నికల్లో జరగనున్న జిల్లాల్లో తక్షణమే ఎన్నికల కోడ్‌ అమలు కానున్నది.

ఎన్నిక‌ల షెడ్యూల్ ఇలా..

. నోటిఫికేష‌న్ విడుద‌ల – ఫిబ్ర‌వ‌రి 3
. నామినేష‌న్ల దాఖ‌లుకు చివ‌రి తేదీ – ఫిబ్ర‌వ‌రి 10
. నామినేష‌న్ల ప‌రిశీల‌న – ఫిబ్ర‌వ‌రి 11
. నామినేష‌న్ల ఉప‌సంహ‌ర‌ణ‌కు చివ‌రి తేదీ – ఫిబ్ర‌వ‌రి 13
. పోలింగ్ – ఫిబ్ర‌వ‌రి 27(ఉద‌యం 8 నుంచి సాయంత్రం 4 వ‌ర‌కు)
. ఓట్ల లెక్కింపు – మార్చి 3

కాగా, తెలంగాణ‌లో రెండు ఉపాధ్యాయ‌, ఒక ప‌ట్ట‌భ‌ద్రుల స్థానానికి ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. వ‌రంగ‌ల్, ఖ‌మ్మం, న‌ల్ల‌గొండ ఉపాధ్యాయ స్థానానికి, మెద‌క్ , నిజామాబాద్, ఆదిలాబాద్, క‌రీంన‌గ‌ర్ ఉపాధ్యాయ స్థానానికి, మెద‌క్ , నిజామాబాద్, ఆదిలాబాద్, క‌రీంన‌గ‌ర్ ప‌ట్ట‌భ‌ద్రుల స్థానానికి ఎన్నిక‌లు నిర్వ‌హించ‌నున్నారు. ఇక ఈ జిల్లాల్లో త‌క్ష‌ణ‌మే ఎన్నిక‌ల కోడ్ అమ‌ల్లోకి రానుంది. మెద‌క్ , నిజామాబాద్, ఆదిలాబాద్, క‌రీంన‌గ‌ర్ గ్రాడ్యుయేట్ స్థానం నుంచి ప్ర‌స్తుతం జీవ‌న్ రెడ్డి(కాంగ్రెస్) కొన‌సాగుతున్నారు. మెద‌క్, నిజామాబాద్, ఆదిలాబాద్, క‌రీంన‌గ‌ర్ టీచర్ స్థానం నుంచి కూర ర‌ఘోత్తం రెడ్డి, వ‌రంగ‌ల్, ఖ‌మ్మం, నల్ల‌గొండ ఉపాధ్యాయ స్థానం నుంచి అలుగుబెల్లి న‌ర్సి రెడ్డి కొన‌సాగుతున్నారు. ఈ ముగ్గురి ప‌ద‌వీకాలం మార్చి 29వ తేదీతో ముగియ‌నుంది.

Read Also: SSMB29.. ప్రియాంక చోప్రా రెమ్యునరేషన్ ఎంతో తెలుసా..?

 

 

 

 

  Last Updated: 29 Jan 2025, 01:30 PM IST