మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను పార్టీ గురించి ఏమీ అనలేదని.. పార్టీ కూడా తన గురించి ఏమీ అనలేదన్నారు. తాను వెనకడుగు వేసే వ్యక్తిని కాదన్నారు. శనివారం మైనంపల్లి తన అనుచరులతో సమావేశమయ్యారు. మల్కాజిగిరి, మెదక్ నియోజకవర్గాల నుంచి బీఆర్‌ఎస్ కార్యకర్తలు, కార్పొరేటర్లు, అభిమానులు పెద్ద ఎత్తున మైనంపల్లి నివాసానికి చేరుకున్నారు. ఇటీవల తిరుమలలో మంత్రి హరీశ్‌రావుపై మైనంపల్లి చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఆయన భవిష్యత్ కార్యాచరణపై విస్తృత చర్చ జరిగింది. అనంతరం మైనంపల్లి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్‌ఎస్‌లోని ఓ సీనియర్ నేత తనకు ఫోన్ చేశారని తెలిపారు.
పార్టీ గురించి తాను ఏమీ అనలేదన్నారు. తాను వెనకడుగు వేసే వ్యక్తిని కాదన్నారు. జీవితాంతం మాట్లాడతానన్నారు. వ్యక్తిగతంగా ఇబ్బంది పెడితే తాను కూడా ఇబ్బంది పెడతానని అన్నారు. తనలో సత్తా ఉందని.. యాక్షన్ కు రియాక్షన్ ఉంటుందన్నారు. మెదక్ నియోజక వర్గంలో ప్రధాన నాయకులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. రేపటి నుంచి వారం రోజుల పాటు మల్కాజిగిరి నియోజకవర్గంలో పర్యటిస్తానని తెలిపారు. వారం తర్వాత మీడియాతో మాట్లాడతానని చెప్పారు. బీఆర్‌ఎస్‌లోని ఓ సీనియర్ నేత తనకు ఫోన్ చేశారని తెలిపారు. తొందరపడవద్దని చెప్పామని.. ప్రజల అభిప్రాయాలు కూడా తీసుకోవాలని సూచించారు.
మరోవైపు మంత్రి హరీశ్‌రావుపై మైనంపల్లి చేసిన ఆరోపణలను బీఆర్‌ఎస్ నాయకత్వం సీరియస్‌గా తీసుకుంది. అయితే బీఆర్‌ఎస్ అధిష్టానం మైనంపల్లికి మల్కాజిగిరి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది. అదే సమయంలో మెదక్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి మైనంపల్లి తన కుమారుడికి బీఆర్‌ఎస్ పార్టీ టిక్కెట్ ఇవ్వడానికి నిరాకరించింది. దీంతో తాజాగా మైనంపల్లి ఈ వ్యాఖ్యలు చేశారు.
Also Read: Road Accident: కువైట్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకే కుటుంబంలో నలుగురు మృతి!