Corona: కొవాగ్జిన్ ఒక డోసు.. కోవిషీల్డ్ ఒక డోసు తీసుకుంటే నాలుగు రేట్లు అధిక రక్షణ

  • Written By:
  • Publish Date - January 4, 2022 / 11:14 AM IST

హైదరాబాద్ లోని ఏఐజీ ఆసుపత్రి వైద్యులు నిర్వహించిన అధ్యయనంలో ఒకే రకం టీకాలను రెండు డోసులుగా తీసుకున్న వారితో పోలిస్తే.. ఒక డోసు కొవాగ్జిన్, ఇంకొక డోసు కోవిషీల్డ్ తీసుకున్నవారిలో స్పైక్ ప్రోటీన్ యాంటీబాడీల స్పందన నాలుగు రెట్లు అధికంగా వృద్ధి చెందుతున్నట్టు పరిశోధకులు గుర్తించారు.

అధ్యయనంలో భాగంగా 330 మంది ఆరోగ్యవంతులైన వలంటీర్లను (టీకాలు తీసుకోనివారు, కరోనా వైరస్ సోకని వారు) ఎంపిక చేసి వారిపై ఈ ప్రయోగాలు చేశారు. ఏఐజీ ఆసుపత్రి చైర్మన్ డాక్టర్ డి.నాగేశ్వర్ రెడ్డి మీడియాతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ.. స్పైక్ ప్రొటీన్ యాంటీబాడీలు వైరస్ ను చంపేసి, ఇన్ఫెక్షన్ తీవ్రతను తగ్గిస్తాయి అని అన్నారు. రెండు వేర్వేరు డోసుల మిశ్రమం సత్ఫలితాలను ఇస్తున్నట్టు ఈ అధ్యయనం తేల్చింది కాగా.. అయితే, ఎటువంటి దుష్ప్రభావాలు తలెత్తలేదు అని అన్నారు.