Mini Medaram Jatara : తెలంగాణ రాష్ట్ర ప్రజలకు వన దేవతలు శ్రీ సమ్మక్క సారలమ్మ దీవెనలు ఆశీర్వాదాలు ఉండాలని మంత్రి సీతక్క గారు అన్నారు. ఈ రోజు తాడ్వాయి మండలం లోని మినీ మేడారం సందర్భంగా వన దేవతలకు మొక్కులు చెల్లించిన మంత్రి సీతక్క అనంతరం మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం మినీ మేడారం జాతరకు అన్ని ఏర్పాటు చేసిందని భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా డ్రింకింగ్ వాటర్ మరియు క్యూ లైన్లో భక్తులకు ఇబ్బందులు లేకుండా చేశామన్నారు.
Read Also: TDP : రైతు కన్నీళ్లు తుడిచిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే..అది టీడీపీనే : ఓ రైతు
ఎప్పటికప్పుడు అధికారులు జాతర పై దృష్టి పెట్టి ఇబ్బందులు తలెత్తకుండా చూస్తున్నారని ఈ మినీ మేడారం జాతరకు ఇప్పటికే సుమారు 6 లక్షల మంది భక్తులు తల్లులకు మొక్కులు చెల్లించారు. ఇంకా రెండు రోజుల పాటు సాగే తెలంగాణ కుంభ మేళ మినీ మేడారం జాతరకు భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి భక్తులకు ఇబ్బందులు లేకుండా బస్ సౌకర్యం కల్పించడం మరుగుదొడ్ల నిర్మాణం జంపన్న వాగు ఒడ్డున స్నాన ఘట్టాలు ఏర్పాటు చేశామని మంత్రి సీతక్క గారు అన్నారు.
ప్రస్తుతం ఎండలు మండిపోతున్న సందర్భంగా గద్దెల ప్రాంతంలో భక్తులకు ఇబ్బందులు కలగకుండా చలువ పందిర్లను ఏర్పాట్లు చేశామని, దాదాపు 5 కోట్ల 30 లక్షల రూపాయలతో వివిధ పనులను పూర్తి చేయడం జరిగిందని వివరించారు. ఈ కార్యక్రమంలో మంత్రి వెంట ఆదిలాబాద్ పార్లమెంట్ ఇంచార్జీ ఆత్రం సుగుణ, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు పైడాకుల అశోక్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బాణోత్ రవి చందర్ తో పాటు పూజారులు,అధికారులు మరియు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర జిల్లా బ్లాక్ మండల గ్రామ నాయకులు కార్యకర్తలు తదితరులు ఉన్నారు.