Site icon HashtagU Telugu

AP : చంద్రబాబు ను జైలుకు పంపించామని టపాసులు కాల్చిన మంత్రి రోజా

Minister Roja First Reaction On Chandrababu Remand

Minister Roja First Reaction On Chandrababu Remand

స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కాం (Skill Development Case) కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu ) కు 14 రోజుల రిమాండ్ విధించింది ఏసీబీ కోర్ట్ (ACB Court). ఈ తీర్పుtho యావత్ తెలుగు ప్రజానీకం అయ్యో అంటూ బాధపడుతుంటే..వైసీపీ నేతలు మాత్రం సంబరాలు చేసుకుంటూ టపాసులు కాల్చి సంబరాలు చేసుకుంటున్నారు. చంద్రబాబు కు సంబంధం లేని కేసులో జగన్ కక్ష్య సాధింపు చర్యగా ఆయన్ను ఇరికించారనేది చెప్పాల్సిన పనిలేదు. ఎఫ్ఐఆర్ లో అసలు చంద్రబాబు పేరు లేనప్పటికీ ఆయన్ను అరెస్ట్ చేయించి..సిట్ విచారణ పేరుతో తన మీడియా ప్రతినిధులను అక్కడ ఉంచి..పెద్ద రాద్ధాంతం చేసాడు. ఇక ఇప్పుడు తీర్పు ఆయన అనుకున్నట్లు రావడంతో పార్టీ నేతలు స్వీట్స్ పంచుతూ..బాణా సంచా కాలుస్తూ సంబరాలు చేసుకుంటున్నారు.

Read Also : ముఖ్యమంత్రిగా పనిచేసిన ఒక వ్యక్తి.. జైలుకు వెళ్లడం ఇదే తొలిసారి

మంత్రి రోజైతే (Minister Roja Reaction) ఏదో సాధించాం అన్నట్లు తెగ సంబరపడిపోతుంది. ప్రతి ఒక్కరి తప్పులను పైనున్న దేవుడు చూస్తూనే ఉంటాడని.. వాళ్లకు ఎప్పుడో ఒకప్పుడు శిక్ష విధిస్తాడని సీఎం జగన్ చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు మంత్రి రోజా. కాగా.. తనను నిబంధనలకు విరుద్ధంగా అరెస్ట్ చేసి.. తన కన్నీటికి కారణమైన చంద్రబాబుకు తన శాపం తగిలిందంని రోజా చెప్పుకొచ్చింది. అయితే.. తాను చేసిన అవినీతికి ఎప్పుడో అరెస్ట్ కావాలని.. కానీ ఇప్పుడే అరెస్ట్ కావాలని దేవుడు ముహూర్తం పెట్టడానికి కారణముందని వివరించింది. ఈ వయసులో ఉన్నప్పుడు ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచి.. ఆయనపైకి చెప్పులను విసిరించి.. మానసిక క్షోభకు కారణం కాగా.. అదే వయసులో ఉన్న చంద్రబాబుకు శిక్ష పడితే ఆ బాధ ఎలా ఉంటుందో తెలియజేయాలని దేవుడు డిసైడ్ అయ్యాడని రోజా తెలిపింది. అంతే కాదు చంద్రబాబు కు ఇది ఆరంభం మాత్రమేనని.. ఆయన జైలు నుంచి బయటకు రాలేడంటూ మంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇది కేవలం స్కిల్ డెవలప్ మెంట్ స్కాం మాత్రమేనని.. ఇంకా అమరావతి భూ కుంభకోణం లాంటి పెద్ద పెద్ద స్కాంలు బయటకు వస్తాయని చెప్పుకొచ్చింది.