Site icon HashtagU Telugu

Parent Teacher Meeting : కొడుకు కోసం సెలవు తీసుకున్న నారా లోకేష్

Lokesh Ptm

Lokesh Ptm

ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) తన కుమారుడు నారా దేవాంశ్ చదువుతున్న పాఠశాలకు వెళ్లారు. పాఠశాలలో నిర్వహించిన పేరెంట్-టీచర్ మీటింగ్ (పీటీఎం) కు ఆయన హాజరయ్యారు. తన అర్ధాంగి నారా బ్రాహ్మణితో కలిసి ఈ సమావేశానికి వెళ్లిన ఫోటోను లోకేశ్ తన ‘ఎక్స్’ (ట్విట్టర్) ఖాతాలో పంచుకున్నారు. ప్రజా జీవితంలో అత్యంత బిజీగా ఉండే రాజకీయ నాయకుడిగా, తన అధికారిక విధులకు విరామం ఇచ్చి మరీ వ్యక్తిగత బాధ్యతలను నిర్వర్తించడం విశేషం.

Salt: ఉప్పు త‌క్కువ లేదా ఎక్కువ‌గా తింటున్నారా? అయితే ఈ వార్త మీకోస‌మే!

ఒక తండ్రిగా తన బాధ్యతను నిర్వర్తించడమే కాకుండా, విద్యలో తల్లిదండ్రుల భాగస్వామ్యం ఎంత ముఖ్యమో చాటిచెప్పడానికే తాను ఈ సమావేశానికి హాజరైనట్లు లోకేశ్ తన సోషల్ మీడియా ఖాతాలో పేర్కొన్నారు. ఈ చర్య ఇతర తల్లిదండ్రులకు, ముఖ్యంగా బిజీగా ఉండే వృత్తి నిపుణులకు ఆదర్శప్రాయంగా నిలుస్తుందని చెప్పొచ్చు. పిల్లల భవిష్యత్తుకు తల్లిదండ్రుల సహకారం, పాఠశాలతో సమన్వయం ఎంత అవసరమో ఇది తెలియజేస్తుంది.

ప్రజా జీవితంలో తీరిక లేకుండా ఉన్న సమయంలో.. ఇలాంటి క్షణాలు చాలా ప్రత్యేకం. దేవాంశ్ నువ్వు చెప్పే ముచ్చట్లు తండ్రిగా సంతోషాన్నిస్తాయి. నిన్ను చూసి గర్వపడుతున్నా అని నారా లోకేశ్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. ఇది ఆయన కుమారుడి పట్ల ఉన్న ప్రేమను, తండ్రిగా పొందే ఆనందాన్ని తెలియజేస్తుంది. రాజకీయ నాయకుడిగా మాత్రమే కాకుండా, ఒక బాధ్యతాయుతమైన తండ్రిగా లోకేశ్ వ్యవహరించిన తీరు సర్వత్రా ప్రశంసలు అందుకుంటోంది.