KTR with Gangavva: కేటీఆర్ ను మహేశ్ బాబుతో పోల్చిన గంగవ్వ!

తెలంగాణ ఐటీ మినిస్టర్ కేటీఆర్ ఛరిష్మా గురించి అందరికీ తెలిసిందే. రాజకీయాల్లోనే కాకుండా, సినిమా, ఇతర రంగాల్లో ఆయనకు

  • Written By:
  • Updated On - October 3, 2022 / 11:40 AM IST

తెలంగాణ ఐటీ మినిస్టర్ కేటీఆర్ ఛరిష్మా గురించి అందరికీ తెలిసిందే. రాజకీయాల్లోనే కాకుండా, సినిమా, ఇతర రంగాల్లో ఆయనకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. యంగ్ డైనమిక్ లీడర్ గా పేరున్న కేటీఆర్ సినిమా హీరోహీరోయిన్స్ మంచి ర్యాపో ఉంది. గతంలో కేటీఆర్ ఛరిష్మాను ద్రుష్టిలో ఉంచుకొని మహీంద్ర గ్రూప్స్ నిర్వాహకులు ఆనంద్ మహీంద్ర సైతం కేటీఆర్ ను హీరోగా అభివర్ణించిన విషయం అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో బిగ్ బాస్ ఫేం గంగవ్వ కూడా కేటీఆర్ పై ప్రశంసల వర్షం కురిపించారు. అచ్చం మహేశ్ బాబులా ఉన్నావని సరాదాగా ముచ్చటించింది. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

కరీంనగర్ కళోత్సవాల ముగింపు కార్యక్రమంలో తెలంగాణ ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కే తారక రామారావు బిగ్ బాస్ ఫేమ్, ప్రముఖ యూట్యూబర్ గంగవ్వపై సరదా వ్యాఖ్యలు చేశారు. మూడు రోజుల పాటు సాగుతున్న సాంస్కృతికోత్సవాల ముగింపు కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ ప్రసంగిస్తూ.. గంగవ్వ తనను టాలీవుడ్ హీరో మహేష్ బాబుతో పోల్చారని, గంగవ్వ మాటలు వింటే మహేష్ బాబు ఫీల్ అవుతారని అన్నారు. గంగవ్వను కూడా తమాషాగా కళ్లను చెక్ చేయమని అడిగాడు. ఇప్పుడు ఆ వీడియో ఇంటర్నెట్‌లో వైరల్‌ అవుతోంది.