Congres vs BRS : తాము దింపిన బుల్లెట్ కేసీఆర్ కు బలంగా దిగింది – కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

కృష్ణ మోహన్.. కేసీఆర్ ఛాంబర్ కు వెళ్లినంత మాత్రానా పార్టీలో చేరినట్లు కాదని.. కేటీఆర్ కూడా నా ఛైర్ దగ్గరకు వచ్చి మాట్లాడిండు. ఆయన కాంగ్రెస్ లో చేరినట్లేనా?

Published By: HashtagU Telugu Desk
Nalgonda

Nalgonda

తెలంగాణ (Telangana) రాజకీయాలు మళ్లీ వేడెక్కుతున్నాయి. నిన్నటి వరకు బిఆర్ఎస్ నుండి కాంగ్రెస్ (Congress) లోకి వెళ్లిన నేతలు మళ్లీ సొంతగూటికి వచ్చేందుకు సిద్దమయ్యారనే వార్తలు రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి. మంగళవారం గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డి (Bandla Krishna Mohan Reddy).. సొంత పార్టీ బిఆర్ఎస్ (BRS) లో చేరారు. ఇటీవలే కాంగ్రెస్​లో చేరిన ఆయన మంగళవారం కేటీఆర్​(KTR)తో సమావేశమై పలు అంశాలపై చర్చించి.. తిరిగి తన సొంతగూడు అయిన బీఆర్​ఎస్​లోనే కొనసాగనున్నట్లు ప్రకటించారు. కేవలం ఈయన మాత్రమే కాదు బిఆర్ఎస్ నుండి వెళ్లిన నేతలంతా కూడా తిరిగి సొంత పార్టీ లోకి రావడం ఖాయం అనే ప్రచారం జరుగుతుంది.

We’re now on WhatsApp. Click to Join.

ఇదిలా ఉండగా..మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి (Minister Komatireddy Venkat Reddy) ..బిఆర్ఎస్ అధినేత , మాజీ సీఎం కేసీఆర్(KCR) ఫై కీలక వ్యాఖ్యలు చేసారు. అసెంబ్లీ సమావేశాలకు ప్రతిపక్ష నేతగా ఉన్న కేసీఆర్ ఎందుకు రావడం లేదని మంత్రి ప్రశ్నించారు. రేవంత్ ఆధ్వర్యంలో మేము ఎన్నికలకు వెళ్ళాం.. అధికారంలోకి వచ్చాం. కానీ హరీష్ రావు, కేటీఆర్ కు బీఆర్ఎస్ పార్టీ మీద నమ్మకం లేదు. సభలో మీకు మేము చాలు అంటున్న కేటీఆర్, హరీష్ ఎన్నికల్లో రేవంత్ ను ఎందుకు ఓడించ లేదని ప్రశ్నించారు. అలాగే ‘ఎప్పుడొస్తే ఏంటీ బుల్లెట్ దిగిందా లేదా అనేది ముఖ్యం. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందా లేదా రాష్ట్రంలో’ అని పేర్కొన్నారు. తాము దింపిన బుల్లెట్ కేసీఆర్ కు బలంగా దిగిందని, సీఎం సీటు పోయిన కేసీఆర్ వైఖరి చూస్తుంటే ఏ క్షణమైనా బీజేపీలో బీఆర్ఎస్ ను విలీనం చేసేటట్టు ఉన్నాడని ఆరోపించారు. ఇక కృష్ణ మోహన్.. కేసీఆర్ ఛాంబర్ కు వెళ్లినంత మాత్రానా పార్టీలో చేరినట్లు కాదని.. కేటీఆర్ కూడా నా ఛైర్ దగ్గరకు వచ్చి మాట్లాడిండు. ఆయన కాంగ్రెస్ లో చేరినట్లేనా? బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి అలాగే కలిసి ఉంటాడు. ఆయన ఎక్కడికి వెళ్ళాడు.

Read Also : Health Tips: బయట ఫుడ్ మాత్రమే కాదండోయ్ ఇంటి ఫుడ్ కూడా ఆరోగ్యానికి మంచిది కాదని మీకు తెలుసా?

  Last Updated: 30 Jul 2024, 08:24 PM IST