NIA: అవినీతి కేసులో NIA అధికారి సస్పెండ్

జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) అధికారిపై హోం శాఖ చర్యలు తీసుకుంది. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయనపై కీలక చర్యలు తీసుకుంది

NIA: జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) అధికారిపై హోం శాఖ చర్యలు తీసుకుంది. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయనపై కీలక చర్యలు తీసుకుంది. ఈ క్రమంలో ఎస్పీ స్థాయి అధికారిని హోం మంత్రిత్వ శాఖ సస్పెండ్ చేసింది.

అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎన్‌ఐఏ అధికారి విశాల్ గార్గ్‌గా గుర్తించారు. విశాల్ గార్గ్ ఢిల్లీలోని NIA ప్రధాన కార్యాలయానికి డిప్యుటేషన్‌పై ఉన్నారు. అవినీతి కేసులో ఆయనపై చర్యలు తీసుకోవడం ఇదే తొలిసారి కాదు. గతంలో 2019లో కూడా విశాల్ గార్గ్ అవినీతి కేసులో సస్పెండ్ అయ్యారు. నాలుగేళ్ల క్రితం విశాల్ గార్గ్‌తో పాటు మరో ఇద్దరు అధికారులు నిశాంత్, మిథిలేష్ సస్పెండ్ అయ్యారు. 2019లో హఫీజ్ సయీద్‌కు సంబంధించిన ఉగ్రవాద నిధుల కేసులో ఢిల్లీ వ్యాపారి పేరు కనిపించకుండా రెండు కోట్ల రూపాయలు డిమాండ్ చేసినట్లు సమాచారం. ఆ తర్వాత నిశాంత్, మిథిలేష్‌లను ఎన్‌ఐఏ ఇంటెలిజెన్స్ అండ్ ఆపరేషన్స్ విభాగంలో నియమించారు.

2020లో విశాల్ గార్గ్‌ను హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ తిరిగి నియమించింది, మరో ఇద్దరు నిందితులకు క్లీన్ చిట్ ఇచ్చింది. అనంతరం విశాల్‌ను లక్నో నుండి ఢిల్లీకి బదిలీ చేసి శిక్షణ ఇన్‌ఛార్జ్‌గా నియమించారు. ఇక ఆయన తాజా సస్పెన్షన్ మరొక అవినీతి ఆరోపణతో ముడిపడి ఉంది. గార్గ్ దర్యాప్తు నివేదికను పరిశీలించిన తర్వాత హోం మంత్రిత్వ శాఖ ఈ నిర్ణయం తీసుకుంది.

విశాల్ గార్గ్ 2007 సంఝౌతా మరియు అజ్మీర్ పేలుళ్ల కేసుల చీఫ్ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్. ఈ కేసులో స్వామి అసీమానంద తదితరులను నిర్దోషులుగా విడుదల చేశారు. ఫిబ్రవరి 2007లో రైలు పేలుడులో 68 మంది మరణించారు. వీరిలో ఎక్కువ మంది పాకిస్థానీలు. సరిహద్దు భద్రతా దళం (BSF) నుండి NIAలో చేరిన మొదటి అధికారులలో గార్గ్ ఒకరు.

Read More: Death Threat: “త్వరలో ముఖ్యమంత్రిని చంపేస్తా”.. మరోసారి యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌కు బెదిరింపు