Honeymoon Murder : మేఘాలయలోని హనీమూన్ ట్రిప్‌ను అమానుష హత్యకు వేదికగా మార్చిన ఘటనలో ఆ కేసు మలుపులు మరింత విషాదంగా మారుతున్నాయి. రాజా రఘువంశీ అనే యువకుడిని అతడి భార్య సోనమ్ రఘువంశీ తన ప్రియుడు రాజ్ కుష్వాహాతో కలిసి పక్కా ప్లాన్‌తో హత్య చేయించింది. కిరాయి హంతకులను ఉపయోగించి మే 23న కాసీ హిల్స్ ప్రాంతంలో రాజాను దారుణంగా చంపించారు. జూన్ 2న రాజా మృతదేహం లభ్యమవగా, జూన్ 8న ప్రధాన నిందితురాలు సోనమ్ ఉత్తరప్రదేశ్‌లోని ఘాజీపూర్‌లో లొంగిపోయింది.
Iran : ప్రతీకార దాడులు..ఇజ్రాయెల్‌పై వంద డ్రోన్లతో విరుచుకుపడిన ఇరాన్
మేఘాలయ పోలీసులు ఈ కేసును మరింత లోతుగా విచారిస్తుండగా, మరో దారుణ ప్లాన్ కూడా వెలుగులోకి వచ్చింది. రాజాను చంపిన తర్వాత, సోనమ్ కూడా చనిపోయిందని నమ్మించేందుకు మరో మహిళను హత్య చేయాలని నిందితులు భావించినట్లు తేలింది. ఆమె మృతదేహాన్ని సోనమ్‌దిగా చూపించాలన్నదే వారి ఉద్దేశం. ఈ హత్య ప్రణాళిక ఫిబ్రవరిలోనే ప్రారంభమైందని తూర్పు ఖాసీ హిల్స్ ఎస్పీ వివేక్ సయీమ్ తెలిపారు.
మే 11న రాజా-సోనమ్ వివాహం జరిగినప్పటికీ, అప్పటికే హత్యకు ప్లాన్ సిద్ధమైపోయింది. మొదట గౌహతిలోనే హత్య చేయాలని భావించినా, చివరకు మేఘాలయలో జరిగే హనీమూన్ టూర్‌ను మర్డర్‌కు వేదికగా మార్చారు. ఈ దారుణానికి పాల్పడేందుకు రాజ్ కుష్వాహా ప్రధానంగా పథకం రచించగా, సోనమ్ స్వయంగా ఒప్పుకుంది. అనంతరం బుర్ఖాలో పారిపోయిందని పోలీసులు గుర్తించారు. హత్యలో పాల్గొన్న కిరాయి హంతకులు విశాల్, ఆకాష్, ఆనంద్‌లను కూడా అరెస్ట్ చేశారు.
ఈ కేసు పరిశీలిస్తున్న అధికారులు, ఇది కేవలం వ్యక్తిగత ద్వేషం మాత్రమే కాకుండా.. ఎప్పటికీ గుర్తుండిపోయే పాశవిక కుట్రగా భావిస్తున్నారు. ఇప్పుడు మరో నిండు ప్రాణాన్ని పొట్టనపెట్టే ప్రయత్నం చేసి ఉండటం మరింత కలచివేసే అంశమని పేర్కొంటున్నారు.
India-China : త్వరలో భారత్ నుంచి చైనాకు నేరుగా విమాన సర్వీసులు ప్రారంభం