Mega Brothers: మెగా బ్రదర్స్ (Mega Brothers) చిరంజీవి, నాగబాబు, పవన్ కళ్యాణ్ ముగ్గురూ ఒకేచోట కలవడం ఇటీవల చాలా అరుదుగా మారిపోయింది. వరుణ్ తేజ్- లావణ్య త్రిపాఠిల వెడ్డింగ్ కోసం వీరంతా ఇటలీలో మరోసారి కలుసుకున్నారు. ఈ పెళ్లి వేడుకకు సంబంధించి ఇప్పటికే పలు ఫోటోలు, వీడియోలు బయటకు రాగా.. తాజాగా ముగ్గురు అన్నదమ్ములు కలిసి దిగిన ఫోటో నెట్టింట వైరల్ అవుతుంది. ఈ ముగ్గురిని ఇలా చూడటంపై మెగా అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
Mega Brothers 😍
📸 from #VarunLav wedding pic.twitter.com/SnzQ4hFErB
— Supreme PawanKalyan FC™ (@SupremePSPK) November 3, 2023
ఇకపోతే మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ పెద్దల సమక్షంలో బుధవారం రాత్రి ఘనంగా పెళ్లి చేసుకున్నారు. వరుణ్ గత కొంతకాలంగా హీరోయిన్ లావణ్య త్రిపాఠితో ప్రేమలో ఉన్నారు. ఈ ఏడాది జూన్ 9న కుటుంబ సభ్యుల సమక్షంలో ఈ జంటకు నిశ్చితార్ధం జరిగింది. అందులో భాగంగానే వరుణ్, లావణ్యలు తమకు ఇష్టమైన ఇటలీలో బుధవారం పెళ్లి చేసుకున్నారు.
Also Read: Telangana: టికెట్ దక్కకపోవడంతో శ్రీవాణి తీవ్ర అసంతృప్తి
ఇటలీలోని టస్కానీలో ఈ జంట పెళ్లి జరిగింది. ఇరు కుటుంబాలతో పాటు బంధువులు, స్నేహితుల సమక్షంలో లావణ్య త్రిపాఠి మెడలో వరుణ్ తేజ్ మూడు ముళ్లు వేశాడు. వీరి పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. వీటితో పాటు పెళ్లి మండపంలో మెగా ఫ్యామిలీ ఫొటోలు కూడా వైరల్ అవుతున్నాయి. ఈ నెల 5న వరుణ్- లావణ్యల రిసెప్షన్ మాదాపూర్ ఎన్- కన్వెన్షన్ లో జరగనుంది.
We’re now on WhatsApp. Click to Join.