Mayawati Supports UCC : యూసీసీకి మేం వ్యతిరేకం కాదు : మాయావతి

Mayawati Supports UCC : యూనిఫాం సివిల్ కోడ్ (యూసీసీ) అమలుకు తమ పార్టీ వ్యతిరేకం కాదని బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) జాతీయ అధ్యక్షురాలు మాయావతి స్పష్టం చేశారు.

Published By: HashtagU Telugu Desk
Mayawati Supports Ucc

Mayawati Supports Ucc

Mayawati Supports UCC : యూనిఫాం సివిల్ కోడ్ (యూసీసీ) అమలుకు తమ పార్టీ వ్యతిరేకం కాదని బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) జాతీయ అధ్యక్షురాలు మాయావతి స్పష్టం చేశారు. “యూనిఫాం సివిల్ కోడ్ గురించి రాజ్యాంగంలో ప్రస్తావన ఉంది. కానీ దాన్ని అమల్లోకి తెచ్చేటందుకు బీజేపీ సర్కారు అనుసరిస్తున్న పద్ధతిని రాజ్యాంగం సమర్థించదు. యూసీసీకి సంబంధించిన అన్ని కోణాలను బీజేపీ పరిశీలించాలి’’ అని బీఎస్పీ చీఫ్ అన్నారు.

Also read : Guru Purnima 2023 : జులై 3న గురు పౌర్ణమి.. జీవితానికి వెలుగులిచ్చే రోజు

“మా పార్టీ (బీఎస్పీ) యూసీసీ అమలుకు వ్యతిరేకం కాదు.. అయితే దేశంలో యూనిఫాం సివిల్ కోడ్‌ను అమలు చేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తున్న విధానాన్ని మేము సమర్థించం. యూసీసీని రాజకీయం చేసి దేశంలో బలవంతంగా అమలు చేయడం సరికాదు” అని మాయావతి పేర్కొన్నారు. అన్ని విషయాల్లో అన్ని మతాల వారికి ఒకే చట్టాన్ని వర్తింపజేస్తే..  అది దేశాన్ని బలోపేతం చేస్తుందన్నారు.  జూలై 3న(సోమవారం)  యూనిఫాం సివిల్ కోడ్‌పై పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చర్చ జరగడానికి ముందు మాయావతి చేసిన ఈ ప్రకటన ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. జులై 20 నుంచి ఆగస్టు 11 వరకు జరగనున్న పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో యూనిఫాం సివిల్ కోడ్ బిల్లును కేంద్ర  ప్రభుత్వం ప్రవేశపెట్టే ఛాన్స్ ఉంది. అనంతరం ఈ బిల్లును పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీకి పంపి.. ప్రజా సంఘాలు, మత సంఘాల అభిప్రాయాలను సేకరిస్తారని తెలుస్తోంది.

  Last Updated: 02 Jul 2023, 12:19 PM IST