Rain Alert Today : తెలంగాణలోని 20 జిల్లాలకు ఎల్లో, ఆరెంజ్ అలర్ట్ లు జారీ

Rain Alert Today : వచ్చే మూడు రోజులు తెలంగాణకు వర్ష సూచన ఉందని వాతావరణ విభాగం (ఐఎండీ) తెలిపింది.

  • Written By:
  • Publish Date - September 3, 2023 / 08:46 AM IST

Rain Alert Today : వచ్చే మూడు రోజులు తెలంగాణకు వర్ష సూచన ఉందని వాతావరణ విభాగం (ఐఎండీ) తెలిపింది. ఈరోజు, రేపు (ఆదివారం నుంచి సోమవారం వరకు) తెలంగాణలోని ఆదిలాబాద్‌, కుమ్రంభీం, మంచిర్యాల, నిర్మల్‌, నిజామాబాద్‌, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్‌, పెద్దపల్లి, జయశంకర్‌, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్‌, వరంగల్‌, హన్మకొండ, జనగాం జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని అంచనా వేసింది. ఈ మేరకు 20 జిల్లాలకు ఎల్లో, ఆరెంజ్‌ అలెర్ట్‌ను జారీ చేసింది.

Also read : Weekly Horoscope : ఈవారం వారికి చికాకులు ఎక్కువ.. సెప్టెంబరు 3 నుంచి 9 వరకు రాశి ఫలాలు

సోమవారం నుంచి మంగళవారం వరకు ఉమ్మడి ఆదిలాబాద్‌, నిజామాబాద్‌, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, సిద్దిపేట జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. కరీంనగర్‌, పెద్దపల్లి, భూపాపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, మహబూబాబాద్‌, వరంగల్‌, హన్మకొండ, యాదాద్రి, రంగారెడ్డి, హైదరాబాద్‌, మేడ్చల్‌ మల్కాజ్‌గిరి, వికారాబాద్‌, సంగారెడ్డి, మెదక్‌, కామారెడ్డి, జిల్లాల్లోనూ అక్కడక్కడ వర్షాలు కురిసే ఛాన్స్‌ ఉందని ఐఎండీ (Rain Alert Today)  చెప్పింది.

Also read : Best Juices: మీరు బరువు తగ్గాలని చూస్తున్నారా.. అయితే ఈ జ్యూస్ ట్రై చేయండి..!

హైదరాబాద్‌లో భారీ వర్షం

ఇక ఇవాళ ఉదయం నుంచే హైదరాబాద్‌లో భారీ వర్షం కురుస్తోంది. హైటెక్ సిటీ, మాదాపూర్, కృష్ణానగర్, కూకట్ పల్లి, ఫిలింగర్, పంజాగుట్ట, ఎస్‌ఆర్ నగర్‌, షేక్‌పేట్, మణికొండ, అమీర్‌ పేట్, రాయదుర్గం, టోలిచౌకి, బంజారాహిల్స్, మెహదీపట్నం, జూబ్లీహిల్స్‌ లో వర్షం దంచి కొడుతోంది. బోయిన్ పల్లి, బాలనగర్, చింతల్, సుచిత్రా, జీడిమెట్ల, కూకట్‌పల్లి సహా పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఈ వర్షాలు పడుతున్నాయని అధికారులు తెలిపారు.