Site icon HashtagU Telugu

Delhi Liquor Scam: భార్య అనారోగ్యం కారణంగా సిసోడియా బెయిల్ పిటిషన్

delhi liquor scam

New Web Story Copy (78)

Delhi Liquor Scam: ఎక్సైజ్ పాలసీ కుంభకోణానికి సంబంధించిన అవినీతి కేసులో ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా మధ్యంతర బెయిల్ కోరుతూ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. జస్టిస్ దినేష్ కుమార్ శర్మతో కూడిన ధర్మాసనం సీబీఐకి నోటీసులు జారీ చేసి గురువారంలోగా స్టేటస్ రిపోర్టు దాఖలు చేయాలని ఆదేశించింది.

మనీలాండరింగ్ ఆరోపణలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కస్టడీకి తీసుకునే ముందు ఫిబ్రవరిలో ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు మనీష్ సిసోడియాను సీబీఐ అరెస్టు చేసింది. గత వారం ట్రయల్ కోర్టు ED కేసులో అతని బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించింది. అయితే తాజాగా సిసోడియా మరోసారి బెయిల్ పిటిషన్ అప్లయ్ చేశారు. తన భార్య అనారోగ్యం దృష్ట్యా మధ్యంతర బెయిల్ కోసం మనీష్ సిసోడియా చేసిన విజ్ఞప్తిపై ఢిల్లీ హైకోర్టు బుధవారం సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ) ప్రతిస్పందనను కోరింది.

ఢిల్లీ లిక్కర్ స్కాములో ఆరోపణలు ఎదుర్కొన్న మనీష్ సిసోడియా ప్రస్తుతం జైల్లో ఉన్నారు. ఆయనను సీబీఐ అరెస్ట్ చేసింది. అయితే ఇప్పటికే ఈడీ, సీబీఐ పలుమార్లు ఆయనను విచారించింది. సిసోడియా పలుమార్లు బెయిల్ పిటిషన్ దాఖలు చేసినప్పటికీ ఈ రోజు వరకు ఆయనకు బెయిల్ రాని పరిస్థితి. తాజాగా సిసోడియా తరుపు న్యాయవాది కోర్టులో మధ్యంతర బెయిల్ పిటిషన్ వేశారు. సిసోడియా తరఫున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ అగర్వాల్, మనీష్ సిసోడియా భార్య ఆసుపత్రి పాలైనట్లు కోర్టుకు తెలిపారు. సిసోడియా భార్యకు 20 ఏళ్లుగా చికిత్స చేస్తున్న వైద్యుడి నుంచి అనారోగ్యంపై నివేదిక సమర్పించాడు. మనీష్ సిసోడియా బెయిల్ పిటిషన్ పై కోర్టు స్పందించింది. మధ్యంతర బెయిల్‌ పిటిషన్‌పై గురువారం విచారణకు వాయిదా వేస్తూ సమాధానం ఇవ్వాలని కోరుతూ జస్టిస్ దినేష్ కుమార్ శర్మ సీబీఐకి నోటీసులు జారీ చేశారు. అయితే ఒక్కరోజులోగా సమాధానం ఇవ్వలేమని సీబీఐ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు.

Read More: TSRTC: పాపులారిటీ కోసం ఇలాంటివి చేయొద్దు, సజ్జనార్ వార్నింగ్!

Exit mobile version