Site icon HashtagU Telugu

Manoj & Mounika : మరోసారి జంటగా కనిపించిన మనోజ్​, మౌనిక..!

Bhuma Mounika Reddy Manchu Manoj

Manoj Bhuma Mounika

టాలీవుడ్ (Tollywood) హీరో మంచు మనోజ్ (Manchu Manoj), దివంగత భూమా నాగిరెడ్డి – శోభ దంపతుల కుమార్తె భూమా మౌనిక రెడ్డి (Bhuma Mounika Reddy) మరోసారి జంటగా కనిపించారు. ఈ ఇద్దరూ ప్రేమలో ఉన్నారని, పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో శుక్రవారం శోభా నాగిరెడ్డి జయంతి సందర్భంగా ఆళ్లగడ్డలో నిర్వహించిన కార్యక్రమానికి మంచు మనోజ్ (Manchu Manoj) హాజరయ్యాడు. మౌనికతో కలిసి శోభా నాగిరెడ్డికి నివాళులు అర్పించాడు త్వరలోనే కొత్త జీవితం మొదలు పెట్టబోతున్నానని చెప్పాడు. దాంతో, మనోజ్ త్వరలోనే రెండో పెళ్లి చేసుకోబోతున్నాడన్న అభిప్రాయాలు మొదలయ్యాయి. రెండో వారంలో ఇరు కుటుంబ సభ్యుల సమక్షంలో వీరు పెళ్లి చేసుకుంటారని వార్తలు వస్తున్నాయి. మనోజ్ గతంలో ప్రణతి రెడ్డిని పెళ్లి చేసుకున్నాడు. కానీ, ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో 2019లో వీరు విడాకులు తీసుకున్నారు. అప్పటి నుంచి ఒంటిరిగా ఉన్న మనోజ్ తన చిన్ననాటి స్నేహితురాలైన భూమా మౌనిక రెడ్డితో ప్రేమలో పడినట్టు వార్తలు వచ్చాయి. ఈ వార్తలపై ఇప్పటిదాకా ఇద్దరూ స్పందించలేదు.

Also Read:  Special Coffee : శీతాకాలంలో ఈ స్పెషల్ కాఫీ ని ట్రై చేయండి..