Explosives-Obama Home : వాషింగ్టన్ లోని అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా ఇంటి దగ్గర పేలుడు పదార్థాలతో తిరుగుతున్న ఒక వ్యక్తిని అరెస్టు చేశారు.
సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు అతడిని అదుపులోకి తీసుకున్నారు.
పేలుడు పదార్థాలతో దొరికిన వ్యక్తిని సియాటెల్ కు చెందిన 37 ఏళ్ల టేలర్ టరాన్టో గా గుర్తించారు. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు మద్దతుగా 2021 జనవరి 6న వైట్ హౌస్ పై దాడికి పాల్పడిన వారిలో టేలర్ టరాన్టో ఒకడు. అతడి కదలికలపై నిఘా పెట్టిన అమెరికా సీక్రెట్ సర్వీస్ టీమ్ .. గురువారం రోజు వాషింగ్టన్ సిటీలో తిరుగుతున్న టేలర్ టరాన్టో వ్యాన్ ను ఫాలో అయింది. అది అమెరికా మాజీ అధ్యక్షుడు ఒబామా ఇంటికి సమీపంలోకి(Explosives-Obama Home) వెళ్లి ఆగింది.
Also read : Twitter Ban: భారత్‌లో 11లక్షల ట్విట్టర్ ఖాతాల తొలగింపు
దీంతో వెంటనే సీక్రెట్ సర్వీస్ టీమ్ దాన్ని చుట్టుముట్టి ..లొంగిపోవాలని టేలర్ టరాన్టో కు చెప్పింది. ఈక్రమంలో అతడు వ్యాన్ లో ఒబామా ఇంటి వైపు దూసుకెళ్లేందుకు యత్నించాడు. కొంతదూరం ముందుకు పోగానే.. అతడి వ్యాన్ ను సీక్రెట్ సర్వీస్ టీమ్ కార్లు అడ్డుకున్నాయి. టేలర్ టరాన్టో ను అరెస్టు చేసి, వ్యాన్ ను సీజ్ చేశారు.