Hyderabad: గణేష్ చేతిలోని 11 కిలోల లడ్డూ చోరీ

హైదరాబాద్ దొంగలకు హాట్ స్పాట్ గా మారిపోతుంది. మహానగరంలో యధేచ్చగా దొంగతనాలకు పాల్పడుతున్నారు. ప్రస్తుతం గణేష్ ఉత్సవాలు జరుగుతున్న విషయం తెలిసిందే

Published By: HashtagU Telugu Desk
Hyderabad

Hyderabad

Hyderabad: హైదరాబాద్ దొంగలకు హాట్ స్పాట్ గా మారిపోతుంది. మహానగరంలో యధేచ్చగా దొంగతనాలకు పాల్పడుతున్నారు. ప్రస్తుతం గణేష్ ఉత్సవాలు జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే విచిత్రంగా గణేష్ మండపాలను టార్గెట్ చేస్తూ దొంగతనాలకు పాల్పడుతున్నారు కొందరు దొంగలు. తాజాగా హైదరాబాద్ లోని మియాపూర్ లో చోరీ జరిగింది. అయితే ఆ చోరీ జరిగిన విధానం చూస్తే ఆశ్చర్యపోతారు.

మియాపూర్‌లో గణేష్ మండపంలో చోరీ జరిగింది. బంగారమో , లేక ఇతర వస్తువులు దొంగిలిస్తే ఫర్వాలేదు కానీ గణేష్ చేతిలో ఉన్న లడ్డూని దొంగిలించాడు ఓ ప్రబుద్దుడు. గత రాత్రి గణేష్ నిర్వాహకులు నిద్రిస్తున్న సమయంలో 11 కిలోల లడ్డూను గుర్తుతెలియని వ్యక్తి దొంగిలించాడు. మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మదీనగూడ జాతీయ రహదారిపై ‘ఓంకార్ సేవా సమితి’ అనే స్థానిక యువజన బృందం గణేష్ విగ్రహాన్ని ప్రతిష్టించారు. బుధవారం తెల్లవారుజామున 4:20 గంటల ప్రాంతంలో 22 నుంచి 25 ఏళ్ల మధ్య వయసున్న ఓ వ్యక్తి గణేష్‌ మండపంలోకి ప్రవేశించి లడ్డూతో పరారయ్యాడు. ఈ తతంగం అంతా సీసీటీవీ కెమెరాలో రికార్డు అయింది. ఈ ఘటనపై నిర్వాహకులు వెంటనే మియాపూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసి నమోదు చేశారు.

Also Read: Transgender Laila : తెలంగాణ ఎన్నికల ప్రచారకర్తగా ట్రాన్స్‌జెండర్‌

  Last Updated: 20 Sep 2023, 05:05 PM IST