Crime News: అనుమానంతో భార్యని కడతేర్చిన భర్త

నానాటికి బంధాలు మసకబారిపోతున్నాయి. ప్రాణం కాపాడటం ఎంత కష్టమో తెలిసిన మనుషులు అదే ప్రాణాన్ని సునాయాసంగా తీసేస్తున్నారు. తాజాగా హైదరాబాద్ లో దారుణం చోటు చేసుకుంది. సొంత భార్యనే కడతేర్చాడో కాస్తాయి భర్త.

Published By: HashtagU Telugu Desk
Hyderabad

Hyderabad

Crime News: నానాటికి బంధాలు మసకబారిపోతున్నాయి. ప్రాణం కాపాడటం ఎంత కష్టమో తెలిసిన మనుషులు అదే ప్రాణాన్ని సునాయాసంగా తీసేస్తున్నారు. తాజాగా హైదరాబాద్ లో దారుణం చోటు చేసుకుంది. సొంత భార్యనే కడతేర్చాడో కాస్తాయి భర్త.

చాంద్రాయణగుట్ట పరిధిలోని మైలార్‌దేవ్‌పల్లి వద్ద నిర్మాణంలో ఉన్న భవనం వద్ద ఓ వ్యక్తి తన భార్యను హత్య చేశాడు.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం అమృత్ సాహు అనే వ్యక్తి తన భార్య కవితతో కలిసి నిర్మాణంలో ఉన్న భవనంలో ఉంటున్నాడు . వీరిద్దరూ భవన నిర్మాణ కార్మికులు.రాత్రి గొడవ పడి అమృత రాయి తీసుకుని భార్య తలపై కొట్టాడు. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. తన భార్యకు వేరే వ్యక్తితో సంబంధం ఉందని సాహు అనుమానిస్తున్నాడని, అది వారి మధ్య తరచూ గొడవలకు దారితీసిందని పోలీసులు గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Also Read: Telangana: రేవంత్ నువ్వు కేసీఆర్ లా మారకు: రాజా సింగ్

  Last Updated: 04 Mar 2024, 09:02 PM IST