Viral Video: నీళ్ళు నిలిచిన చోట రోడ్డు దాటిస్తూ సంపాదన.. భలే బిజినెస్ ఐడియా!

చాలామంది బతుకుతెరువు కోసం ఎన్నో రకాల పనులు చేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే వారికి తోచిన విధంగా వ్యాపారాలు

  • Written By:
  • Publish Date - September 20, 2022 / 08:45 AM IST

చాలామంది బతుకుతెరువు కోసం ఎన్నో రకాల పనులు చేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే వారికి తోచిన విధంగా వ్యాపారాలు చేస్తూ ఉంటారు. వ్యాపారం అంటే ఏం ఏం వ్యాపారం చేసాం అన్నది కాదు డబ్బులు సంపాదించడం ముఖ్యం అని అంటూ ఉంటారు. ఇప్పుడు మనం తెలుసుకోబోయే వ్యక్తి కూడా అటువంటి మాటకు చక్కగా సరిపోతాడు అని చెప్పవచ్చు. పూర్తి వివరాల్లోకి వెళితే.. ఇటీవల సోషల్ మీడియాలో ఒక వీడియో తెగ వైరల్ అవుతోంది.

అయితే ఆ వీడియోలో వర్షాల కారణంగా రోడ్డుపై నీరు పాడుతూ ఉండడంతో అటుగా వెళుతున్న కొంతమంది పాదచారులు రోడ్డు క్రాస్ చేయడానికి ఇబ్బందులు పడుతున్నారు. రోడ్డుపై కార్లు వెళుతున్నాయి కానీ అక్కడ నడుచుకుంటూ వెళ్లే వారికి కాళ్లు బూట్లు తప్పకుండా తడిసిపోతాయి. అక్కడున్న బురద,మట్టి కారణంగా బట్టలు పాడవుతాయి. అయితే ఈ సమయంలోనే ఒక వ్యక్తి సరికొత్త బిజినెస్ ఐడియాని వేశాడు. చిన్నపాటి తోపుడు బండిని తీసుకుని వచ్చి రోడ్డుకి ఒక వైపు పెట్టుకొని నిలబడ్డాడు.

ఆ నీటిలో రోడ్డు దాటాలి అనుకుంటున్నా పాదచారుల దగ్గర డబ్బులు తీసుకొని ఆ తోపుడు బండిపై వారి నిలబెట్టుకునే రోడ్డుకు ఈవైపు నుంచి అటువైపుకు తీసుకెళ్లి వదిలేస్తున్నాడు. అయితే చాలామంది నీటిలో వెళ్లడానికి ఇష్టపడలేక అతని బండి ఎక్కి రోడ్డు దాటుతున్నారు. ఎందుకు సంబంధించిన వీడియో ని షేర్ చేస్తూ సమస్యలు ఉన్నప్పుడు సంపాదించే మార్గం ఇది అంటూ క్యాప్షన్ ని కూడా జోడించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవ్వడంతో ఆ వీడియోని చూసిన నెటిజన్స్ ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా స్పందిస్తున్నారు.