నగరంలోని కూకట్‌పల్లి (Kukatpally) ప్రాంతంలో మే 11 రాత్రి ఓ దారుణ హత్య జరిగింది. సర్దార్‌పటేల్ నగర్‌లోని ఓ అపార్ట్‌మెంట్ సమీపంలోని పార్కులో ఐదుగురు యువకులు గంజాయి (Ganja) మత్తులో ఉన్నారని స్థానికులు గుర్తించారు. అక్కడే వాచ్మెన్‌గా పని చేస్తున్న వెంకటరమణ (Venkataramana) తన స్నేహితులతో కలిసి వారిని నిలదీయగా, వారిలో ఒకరైన పవన్‌తో వాగ్వాదం చోటుచేసుకుంది. చిన్న చిన్న మాటలు కాస్తా ఘర్షణకు దారి తీస్తూ, పవన్ చేతిలో ఉన్న ఇనుప కడ్డీతో వెంకటరమణను గుండెల్లో బలంగా గుద్దాడు. తీవ్ర గాయాల కారణంగా వెంకటరమణ అక్కడికక్కడే మరణించాడు.
Rohit Sharma: వన్డే రిటైర్మెంట్‌పై క్లారిటీ ఇచ్చిన రోహిత్ శర్మ!
ఈ దృశ్యాలను చూసిన స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. వెంటనే వారు పోలీసులకు సమాచారం అందించగా, కేపీహెచ్‌బీ పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. నిందితుడు పవన్ సహా మిగిలిన యువకులు అక్కడినుంచి పరారయ్యారని పోలీసులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసి, నిందితుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.
గత కొంతకాలంగా గంజాయి వినియోగం కారణంగా నేరాలు పెరుగుతున్నాయి. ఈ సంఘటన ఈ సమస్య ఎంత తీవ్రంగా ఉందో మరోసారి రుజువు చేసింది. మత్తు పదార్థాల వాడకాన్ని నియంత్రించడానికి కఠిన చర్యలు తీసుకోవాలని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.