ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh)హర్దోయ్(Hardoi district)లో ఒక దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. అదనపు కట్నం (Dowry ) కోసం భార్యను వేధించడమే కాకుండా, ఆమె జడను (wife’s braid) కోసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. రాంప్రతాప్ అనే వ్యక్తి తన భార్య బ్యూటీ పార్లర్‌కి వెళ్ళిందన్న కారణంతో ఆమె జడను కత్తిరించాడు. బాధిత మహిళ తండ్రి రాధాకృష్ణ పోలీసులకు ఫిర్యాదు చేయగా, అదనపు కట్నం డిమాండుతో పాటు ఆ కుటుంబం వత్తిడి పెడుతోందని ఆరోపించారు.
Anchor Rashmi : యాంకర్ రష్మీకి సర్జరీ..ఎందుకంటే !
ఈ వ్యవహారంపై పోలీసులు స్పందిస్తూ రాంప్రతాప్‌పై కేసు నమోదు చేసి అతడిని అరెస్ట్ చేశారు. బ్యూటీ పార్లర్ వద్దే తన ముగ్గురు సహచరులతో కలిసి రాంప్రతాప్ భార్య జడను కోసినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనపై స్థానికులు స్పందిస్తున్నారు. పార్లర్‌కి వెళ్ళిందని ఆమెను ఇంతలా అవమానించడం దారుణమని కొందరు అంటుండగా, ఇది కట్న వేధింపులలో భాగమేనని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. ఏది ఏమైనప్పటికి ఈ ఘటన సోషల్ మీడియా ఓ చక్కర్లు కొడుతుంది.