Site icon HashtagU Telugu

Hyderabad : ఇన్‌క‌మ్ ట్యాక్స్ బిల్డింగ్‌పై నుంచి దూకి వ్య‌క్తి ఆత్మ‌హ‌త్య‌

Deaths

Deaths

హైదరాబాద్ నాంపల్లిలోని ఇన్‌కమ్ ట్యాక్స్ టవర్స్ ఐదో అంతస్తు నుంచి దూకి ఓ వ్య‌క్తి ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. మృతుడు ఉత్తరప్రదేశ్‌లోని గౌతమ్ బుద్ధ జిల్లాకు చెందిన అశుతోష్ శర్మగా పోలీసులు గుర్తించారు. ఇన్‌క‌మ్ ట్యాక్స్ ట‌వ‌ర్స్‌లో మల్టీ టాస్కింగ్ ఉద్యోగిగా గత ఏడాది జాయిన్ అయిన‌ట్లు పోలీసులు తెలిపారు. అశుతోష్ శ‌ర్మ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారా లేదా ఎవ‌రైనా బిల్డింగ్‌పై నుంచి నెట్టివేశారా అనే కోణంలో పోలీసులు విచార‌ణ చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం ఆసుప‌త్రికి త‌ర‌లించారు. ఈ ఘటనపై శర్మ తల్లిదండ్రులకు పోలీసులు సమాచారం అందించారు