Site icon HashtagU Telugu

Stepdaughter: కుమార్తెలపై సవతి తండ్రి అత్యాచారం, ఆపై గర్భం

Stepdaughter

New Web Story Copy 2023 07 15t192142.748

Stepdaughter: ఆంధ్రప్రదేశ్‌లో దారుణం జరిగింది. భర్త చనిపోయిన ఓ మహిళ 42 ఏళ్ళ వ్యక్తిని పెళ్లి చేసుకుంది. అయితే అప్పటికే ఆ మహిళకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఒక కుమార్తె వయసు 17 సంవత్సరాలు కాగా, మరో కుమార్తె వయసు 16 సంవత్సరాలు. అయితే తండ్రి స్థానంలో ఉన్న ఆ నీచుడు సవతి కుమార్తెలపై కన్నేశాడు. పలు మార్లు ఆ బాలికలపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ క్రమంలో 17 ఏళ్ళ బాలిక గర్భం దాల్చింది. ఈ నేపథ్యంలో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయగా సవతి తండ్రిపై కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. పోలీసులు చెప్పిన ప్రకారం విశాఖపట్నంకు చెందిన మహిళ మొదటి భర్త 2010లో మరణించాడు. దీంతో ఆమె మరో పెళ్ళికి సిద్దపడింది. ఈ క్రమంలో 42 ఏళ్ళ వ్యక్తిని పెళ్లి చేసుకుంది. కాగా మైనర్ బాలిక ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు లైంగిక నేరాల నుంచి పిల్లల రక్షణ (పోక్సో) చట్టం కింద కేసు నమోదు చేసి సవతి తండ్రిని అరెస్టు చేశారు. ప్రస్తుతం విచారణ కొనసాగుతోంది.

Read More: CLP Leader Bhatti : తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం రావాలి – సీఎల్పీ నేత భ‌ట్టి