Mahila Maha Panchayat: ఉద్రిక్తంగా మల్లయోధుల మహాపంచాయత్‌

ఓ వైపు కొత్త పార్లమెంట్ భవన ప్రారంభోత్సవం, మరోవైపు మల్లయోధుల నిరసనలతో ఢిల్లీ వ్యాప్తంగా భారీగా పోలీసులు మోహరించారు.

Mahila Maha Panchayat: ఓ వైపు కొత్త పార్లమెంట్ భవన ప్రారంభోత్సవం, మరోవైపు మల్లయోధుల నిరసనలతో ఢిల్లీ వ్యాప్తంగా భారీగా పోలీసులు మోహరించారు. మల్లయోధులు మహిళా మహాపంచాయత్‌ను ప్రకటించిన తర్వాత సింగు సరిహద్దు వద్ద పోలీసులు అప్రమత్తమయ్యారు. ప్రధాన రహదారిపై ప్రతి వాహనాన్ని తనిఖీ చేస్తున్నారు పోలీసులు. ఇక మహాపంచాయత్‌లో చేరేందుకు రాకేష్ టికైత్ యూపీ గేట్ వద్దకు చేరుకున్నారు.

ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద దాదాపు 35 రోజులుగా సమ్మె చేస్తున్న మల్లయోధులు ఆదివారం కొత్త పార్లమెంట్ భవనాన్ని ప్రారంభించిన సందర్భంగా మహిళా మహాపంచాయత్‌ను ప్రకటించారు. మహిళా మహాపంచాయత్‌ను దృష్టిలో ఉంచుకుని ఢిల్లీ సరిహద్దుల్లో పోలీసులు భద్రతను పెంచారు.దీంతో రహదారులపై ట్రాఫిక్ జామ్‌ సమస్య తలెత్తింది. అదే సమయంలో మహిళా మహాపంచాయత్‌లో చేరడానికి రైతులు ఢిల్లీ సరిహద్దులకు చేరుకుంటున్నారు. వారిని పోలీసులు అడ్డుకుని అదుపులోకి తీసుకుంటున్నారు. ఇదిలా ఉండగా మహిళా సమ్మాన్ మహాపంచాయతీ రెజ్లర్ల నిరసనలో భాగమయ్యేందుకు రైతు నాయకుడు రాకేష్ టికైత్ యూపీ గేట్‌కు చేరుకున్నారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

Read More: ODI World Cup: ఆ మ్యాచ్ తర్వాతే వన్డే ప్రపంచ కప్-2023 వేదికను ప్రకటిస్తాం.. 15 స్టేడియాలు షార్ట్‌లిస్ట్: జై షా