Mahesh Goud : మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చేసిన వ్యాఖ్యలపై టీఎస్‌పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తీవ్ర స్థాయిలో స్పందించారు. స్థానిక సంస్థల ఎన్నికలపై మంత్రి పొంగులేటి చేసిన ప్రకటన సరైనది కాదని, ఇలాంటి విషయాలు కేబినెట్‌లో చర్చించాల్సినవేనని గుర్తు చేశారు. “ప్రభుత్వ వ్యవహారాల్లో ప్రతి అంశాన్ని కేబినెట్‌లో చర్చించి నిర్ణయం తీసుకోవాలి. కానీ, మంత్రి పొంగులేటి ముందుగానే ప్రకటన చేయడం తగదు. కోర్టులో పెండింగ్‌లో ఉన్న అంశాలపై మాట్లాడే ముందు జాగ్రత్తగా ఆలోచించాలి,” అని మహేష్ గౌడ్ తెలిపారు.
“కాంగ్రెస్ పార్టీ ఒక క్రమశిక్షణగల పార్టీ. ఇక్కడ ఎవరైనా తమ ఇష్టానుసారం నిర్ణయాలు ప్రకటించరాదు. పార్టీ శ్రేయస్సు, సామూహిక నిర్ణయం ప్రధానమయ్యేలా వ్యవహరించాలి. మంత్రులెవరికైనా ఇది వర్తిస్తుంది,” అని స్పష్టం చేశారు. “ఒక మంత్రిత్వ శాఖ విషయంపై మరో మంత్రి వ్యాఖ్యలు చేయడం సరైంది కాదు. ప్రతి ఒక్కరు తమ శాఖ పరిధిలోనే ఉండాలి. ఇటువంటి విషయాలు ప్రజల్లో అపోహలు, గందరగోళం కలిగించవచ్చు,” అని గౌడ్ హెచ్చరించారు. పీసీసీ చీఫ్ చేసిన ఈ వ్యాఖ్యలు మంత్రి పొంగులేటి ప్రకటనను ప్రశ్నించేలా ఉండగా, కాంగ్రెస్ లోపల సహకార సూత్రాలపైనే ఓ స్పష్టమైన సందేశాన్ని ఇచ్చాయి. ఇప్పుడు పొంగులేటి దీనిపై స్పందన ఎలా ఉంటుందన్నది రాజకీయంగా ఆసక్తికరంగా మారింది.
PM Modi : డిజిటల్ లావాదేవీల్లో 50 శాతం యూపీఐ ద్వారానే: ప్రధాని మోడీ