Site icon HashtagU Telugu

Maharashtra Portfolio: మహారాష్ట్ర మంత్రులకు శాఖల కేటాయింపు.. ఎవ‌రీ ద‌గ్గ‌ర ఏ శాఖ‌లు ఉన్నాయంటే?

Maharashtra Portfolio

Maharashtra Portfolio

Maharashtra Portfolio: కొన్ని వారాలుగా కొనసాగుతున్న ఉత్కంఠకు తెరదించుతూ మహారాష్ట్ర ప్రభుత్వం శనివారం రాష్ట్ర మంత్రివర్గ శాఖలను (Maharashtra Portfolio) ప్రకటించింది. ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌కు హోంశాఖ, డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్‌ షిండేకు పట్టణాభివృద్ధి, ప్రజాపనుల శాఖ, ఉప ముఖ్యమంత్రి అజిత్‌ పవార్‌కు ఆర్థిక, రాష్ట్ర ఎక్సైజ్‌ శాఖలు దక్కాయి. దీంతోపాటు చంద్రశేఖర్ బవాన్‌కులేకు రెవెన్యూ బాధ్యతలు అప్పగించారు.

మహారాష్ట్రలో సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ మంత్రులకు పోర్ట్‌ఫోలియో పంపిణీ చేశారు. సీఎం ఫడ్నవీస్ హోం శాఖను తన వద్దే ఉంచుకున్నారు. ఇది కాకుండా సీఎం తన వ‌ద్ద‌ సమాచార మరియు ప్రచార శాఖ, సాధారణ పరిపాలన, న్యాయ శాఖను కూడా ఉంచుకున్నారు. కాగా డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్ షిండేకు పట్టణాభివృద్ధి, గృహనిర్మాణం, ప్రజాపనుల శాఖల బాధ్యతలు అప్పగించారు. ఎన్సీపీ అధినేత అజిత్ పవార్‌కు ఆర్థిక, ప్రణాళిక, ఎక్సైజ్ శాఖ బాధ్యతలు అప్పగించారు.

Also Read: Pushpa 2 Premiere Show : అల్లు అర్జున్ ఇలా దొరికిపోయాడేంటి..?

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు చంద్రశేఖర్‌ బవాన్‌కులేకు రెవెన్యూ శాఖ బాధ్యతలు అప్పగించారు. చంద్రకాంత్ పాటిల్‌కు హయ్యర్ ఎడ్యుకేషన్ టెక్నికల్ బాధ్యతలు, గిరీష్ మహాజన్‌కు జలవనరుల శాఖ బాధ్యతలు అప్పగించారు. ఎన్సీపీ నేత ధనంజయ్ ముండేకు ఆహారం, పౌరసరఫరాల శాఖ, గణేష్ సుభద్ర నాయక్‌కు అటవీ శాఖ బాధ్యతలు అప్పగించారు. అదితి తత్కరేకు మహిళా శిశు అభివృద్ధి, ఐటీ శాఖ ఆశిష్ షెలార్, సహకార శాఖ బాబా సాహెబ్ పాటిల్, వైద్య శాఖ ప్రకాశ్ సుశీల ఆనందరావులకు బాధ్యతలు అప్పగించారు.

ఎవరి ద‌గ్గ‌ర ఏమున్నాయి?

పాఠశాల విద్యాశాఖ మంత్రిగా శివసేనకు చెందిన దాదా భూసే, పరిశ్రమల శాఖ మంత్రిగా ఉదయ్ సమంత్ కొనసాగనున్నారు. సేనకు చెందిన ప్రకాష్ అబిత్కర్ ఆరోగ్య శాఖ కొత్త రాష్ట్ర మంత్రి కాగా, ప్రతాప్ సర్నాయక్ రవాణా మంత్రిగా బాధ్య‌త‌లు చేప‌ట్టారు. బిజెపికి చెందిన చంద్రశేఖర్ బవాన్‌కులేకు రెవెన్యూ శాఖ లభించగా, జలవనరుల శాఖ బిజెపికి చెందిన రాధాకృష్ణ విఖే పాటిల్, గిరీష్ మహాజన్ మధ్య విభజించబడింది. హస్సమ్ ముష్రీఫ్‌కు వైద్య విద్య శాఖ దక్కింది. డిసెంబర్ 5న ఫడ్నవీస్ రాష్ట్ర ముఖ్యమంత్రి కాగా, ఏక్నాథ్ షిండే, అజిత్ పవార్ ఉప ముఖ్యమంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. డిసెంబర్ 15న నాగ్‌పూర్‌లోని రాజ్‌భవన్‌లో 39 మంది మంత్రులకు చేరిక ప్రక్రియ జరిగింది