Site icon HashtagU Telugu

Mahakumbh Mela Stampede: మ‌హా విషాదం.. కుంభ‌మేళా తొక్కిస‌లాట‌లో 30 మంది మృతి

Mahakumbh Mela Stampede

Mahakumbh Mela Stampede

Mahakumbh Mela Stampede: మౌని అమావాస్య రోజు ఉదయం మహాకుంభంలో తొక్కిసలాట (Mahakumbh Mela Stampede) జరిగింది. ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌లు తీవ్ర ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఈ ప్రమాదంపై ఇరువురు నేతలు మీడియాలో ప్రకటనలు చేస్తూ సంతాపం వ్యక్తం చేశారు. మౌని అమావాస్య రోజు ఉదయం జరిగిన మహాకుంభంలో తొక్కిసలాట జరగడంపై ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం మొదటి అధికారిక ప్రకటన వచ్చింది. ఈ తొక్కిసలాటలో ఇప్పటి వరకు 30 మంది మరణించారని పోలీసు డిఐజి వైభవ్ కృష్ణ తెలిపారు. అదే సమయంలో 19 మంది గాయపడ్డారు. మరణించిన వారిలో 25 మందిని గుర్తించారు. మ‌రో ఐదుగురిని గుర్తించాల్సి ఉంది. గుజరాత్, కర్ణాటక, ఇతర రాష్ట్రాలకు చెందిన వారు ఉన్నారు.

పోలీస్ డీఐజీ తెలిపిన వివరాల ప్రకారం.. బుధ‌వారం తెల్లవారుజామున 1.30 గంటల సమయంలో ఘాట్ వద్ద జనం భారీగా తరలివచ్చారు. ఈ సందర్భంగా జనాన్ని అదుపు చేసేందుకు బారికేడ్లు ఏర్పాటు చేశారు. బ్రహ్మ ముహూర్తం సందర్భంగా స్నానాలు చేసేందుకు జనాల మధ్య పోటీ నెలకొనడంతో బారికేడ్‌ని దాటుకుని స్నానానికి పరుగులు తీశారు. దీని తరువాత తొక్కిసలాట జరిగింది, ప్రజలు ఘాట్ చుట్టూ నిద్రిస్తున్న ప్రజల మీద నుంచి వెళ్ల‌డంతో ఈ తొక్కిస‌లాట ఘ‌ట‌న జ‌రిగింద‌ని డీఐజీ పేర్కొన్నారు.

Also Read: Caste Survey : కులగణన సర్వే తుది నివేదిక.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు

గ్రీన్ కారిడార్ ఏర్పాటు చేశామని పోలీసులు స్పష్టంగా చెప్పారు. కానీ నేటికి ఘాట్ వద్ద VIP ప్రోటోకాల్ లేదు. ప్రస్తుతం మ‌హా కుంభ‌మేళా వ‌ద్ద పరిస్థితి అదుపులో ఉంది. ఈ తొక్కిస‌లాట‌లో 30 మంది మృతి చెందడ‌మే కాకుండా మ‌రో 100 మంది ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్న‌ట్లు పేర్కొన్నారు. అయితే మృతుల సంఖ్య మ‌రింత పెరిగే అవ‌కాశం ఉన్న‌ట్లు స‌మాచారం అందుతోంది. ఈ సాయంత్రం వరకు 5 కోట్ల మందికి పైగా ప్రజలు అమృత్‌లో స్నానాలు చేసినట్లు చెబుతున్నారు. అలాగే జనవరి 13 నుండి ఇప్పటివరకు సుమారు 25 కోట్ల మంది ప్రజలు మహాకుంభ్‌లో స్నానం చేసిన‌ట్లు తెలుస్తోంది.