Maganti Babu : నేను టీడీపీలోనే ఉంటా..

తాను పార్టీ మారబోతున్నట్లు వస్తున్న వార్తలపై ఏలూరు టీడీపీ సీనియర్ నేత మాగంటి బాబు (Maganti Babu) స్పందించారు. 'గత 24 గంటల నుంచి సోషల్ మీడియాలో వస్తున్న వార్తలన్నీ అవాస్తవం.

  • Written By:
  • Updated On - March 27, 2024 / 10:32 AM IST

తాను పార్టీ మారబోతున్నట్లు వస్తున్న వార్తలపై ఏలూరు టీడీపీ సీనియర్ నేత మాగంటి బాబు (Maganti Babu) స్పందించారు. ‘గత 24 గంటల నుంచి సోషల్ మీడియాలో వస్తున్న వార్తలన్నీ అవాస్తవం. నేను పార్టీ మారతాననే వార్తలను నమ్మొద్దు. వ్యక్తిగత పనులపై హైదరాబాద్లో ఉండటంతో క్యాంప్ కార్యాలయంలో అందుబాటులో లేను. టీడీపీ (TDP)ని విడిచిపెట్టే ఆలోచన నాకు లేదు’ అని మాగంటి బాబు కార్య కర్తలతో అన్నారు.

We’re now on WhatsApp. Click to Join.

అయితే.. ఏపీలో టీడీపీకి వరుస షాకులు తగులుతున్నాయి. జనసేన (Janasena)- బీజేపీ (BJP)తో పొత్తు పెట్టుకోవడంతో టికెట్‌ ఆశించి భంగపడ్డ మాగంటి బాబు పార్టీ వీడేందుకు సిద్ధమయ్యారని వార్తలు గుప్పుమన్నాయి. తెలుగుదేశం పార్టీలో దీర్ఘకాలం పనిచేసిన మాగంటి బాబు కుటుంబం రాజకీయంగా పలుకుబడి కలిగిన కుటుంబం. అయితే.. తండ్రి మాగంటి రవీంద్రనాథ్ చౌదరి, తల్లి మాగంటి లక్ష్మి ఇద్దరూ రాష్ట్ర మంత్రులుగా పనిచేసినవాళ్లే. అయితే.. కమ్మ సామాజికవర్గంలో బలమైన కుటుంబం. చాలాకాలంగా.. ఏలూరు కేంద్రంగా రాజకీయాలు చేస్తున్నారు. ఏలూరు ఎంపీగా 1998లో కాంగ్రెస్ పార్టీ నుంచి విజయం సాధించి తరువాత దెందులూరు నుంచి ఎమ్మెల్యేగా గెలిచి వైఎస్ కేబినెట్‌లో మంత్రిగా పనిచేశారు మాగంటి బాబు. ఆ తరువాత తెలుగుదేశంలో చేరిన మాగంటి బాబు 2014లో ఎంపీగా గెలిచారు. తిరిగి 2014 లో ఎంపీగా గెలిచారు.

ఈసారి ఎంపీ టికెట్ దక్కుతుందని ఆశించి భంగపడ్డారు మాగంటి బాబు.. అయితే… ఎప్పుడూ కమ్మ సామాజికవర్గమే పోటీ చేసే ఏలూరు ఎంపీ స్థానం నుంచి యనమల రామకృష్ణుడు అల్లుడైన పుట్టా మహేశ్ యాదవ్‌కు టీడీపీ ఈసారి అవకాశం కల్పించడంతో మాగంటి బాబుతో సహా కమ్మ సామాజికవర్గంలో వ్యతిరేకత వ్యక్తమవుతోందని వార్తలు వినిపిస్తున్నాయి. అసలే ఇటీవల స్వల్ప వ్యవధిలో ఇద్దరు కుమారులు మరణించడంతో మానసిక వేదనతో ఉన్న మాగంటి బాబుకు టికెట్ లభించకపోవడం మరింత నిరాశ కలిగింది. ఈలోగా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్వయంగా ఫోన్ చేసి మాగంటి బాబును పార్టీలోకి ఆహ్వానించినట్టు.. ఇందుకు మాగంటి బాబు కూడా అంగీకారం తెలిపారని వార్తలు బయటకు రావడంతో.. సోషల్‌ మీడియాలో మాగంటి బాబు టీడీపీని వీడనున్నట్లు పుకార్లు షికారు చేయడంతో ఆయనే క్లారిటీ ఇచ్చారు.

Read Also : Ram Charan Game Changer Photo Leak : గేమ్ చేంజర్ నుంచి మరో లీక్.. స్టేజ్ మీద నుంచి హీరోని నెట్టేసిన రౌడీలు..!