Madhapur Accident: హైదరాబాద్ లో విషాదం చోటుచేసుకుంది. వాటర్ ట్యాంకర్ ఢీకొని స్విగ్గీ డెలివరీ బాయ్ అక్కడికక్కడే మృతి చెందాడు. వివరాలు చూస్తే… హైదరాబాద్ మాదాపూర్ లో స్విగ్గీ డెలివరీ బాయ్ డెలివరీ కోసం వెళుతుండగా వాటర్ ట్యాంకర్ ఢీకొట్టింది. దీంతో డెలివరీ ఏజెంట్ అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. ఈ ఘటన బుధవారం మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో జరిగినట్టు తెలుస్తుంది. ఈ ప్రమాదానికి వాటర్ ట్యాంకర్ డ్రైవర్ కారణమని చెప్తున్నారు స్థానికులు. రాష్ డ్రైవింగ్ కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు చెప్తున్నారు. ప్రమాద ఘటనాస్థలికి చేరుకున్న మాదాపూర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. వాటర్ ట్యాంకర్ డ్రైవర్ ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు పోలీసులు.
Read More: Hero Srivishnu: మెగాస్టార్ ఆటోగ్రాఫ్ తో నా జాతకం మారిపోయింది: హీరో శ్రీవిష్ణు