టీమిండియా మాజీ కెప్టెన్ చెన్నై సూపర్ కింగ్స్ సారథి మహేంద్ర సింగ్ ధోనీ పరువు నష్టం కేసుపై మద్రాస్ హైకోర్టు విచారించింది. తనపై అసత్య కథనాలు ప్రసారం చేశారంటూ జీ న్యూస్ నెట్ వర్క్ పై ధోనీ మద్రాస్ హైకోర్టులో రూ.100 కోట్లకు పరువునష్టం దావా వేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో పది రోజుల్లోగా స్పందించాలని జీ మీడియాను మద్రాసు హైకోర్టు ఆదేశించింది. 2014లో టెలివిజన్ చర్చ సందర్భంగా తనపై పరువు నష్టం కలిగించే వ్యాఖ్యలు చేసినందుకు జీ మీడియాపై ఐపీఎల్ మహేంద్ర సింగ్ ధోనీ కేసు పెట్టారు. వంద కోట్ల రూపాయల నష్టపరిహారం ఇవ్వా
లని ధోనీ సేన విజ్ఞప్తి చేసింది. దీంతో ధోనీ సంధించిన 17 ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలని జీ మీడియాను మద్రాస్ హైకోర్టు సింగిల్ జడ్జి ఆదేశించారు. దీనిపై దాఖలైన అప్పీలు న్యాయమూర్తులు మహదవెన్, మహ్మద్ సాబిక్‌లతో కూడిన ధర్మాసనం ముందు విచారణకు వచ్చింది. అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన ధోనీపై ఆరోపణలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని అప్పట్లో సూచించింది. ఈ నేపథ్యంలో ధోనీ సంధించిన ప్రశ్నలకు 10 రోజుల్లోగా సమాధానం ఇవ్వాలని జీ మీడియాను మద్రాసు హైకోర్టు ఆదేశించింది.
Also Read: Khatabook: ధోనీ పెట్టుబడి పెట్టిన కంపెనీలో లే ఆఫ్స్..!