Hyderabad: హైదరాబాద్ లో ఓ ఇంట్లో ఎల్‌పీజీ సిలిండర్ లీకేజీ కావడంతో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. దోమలగూడలోని రోజ్ కాలనీలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. రోజ్ కాలనీలో ఉంటున్న ఓ ఇంట్లో ఎల్‌పీజీ సిలిండర్ లీకేజీ అయి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ముగ్గురు చిన్నారులు సహా ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించగా, ప్రమాదంలో గాయపడిన కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. దోమలగూడ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Read More: Rashmika Mandanna: ముంబై ఎయిర్ పోర్ట్ లో రష్మిక క్రేజ్.. వీడియో వైరల్!