Lowest Polling: తెలంగాణ ఎన్నికలకు సంబంధించి గురువారం ఉదయం 7 గంటల నుంచే పోలింగ్ ప్రక్రియ స్టార్ట్ అయింది. ఎక్కడ చూసినా ఓటర్లతో నిండి ఉంది. కానీ ఎప్పటిలాగే హైదరాబాద్ ఓటర్లు మాత్రం తక్కువ మంది తమ ఓటుహక్కు (Lowest Polling)ను వినియోగించుకున్నారు. ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైన పోలింగ్ కొద్దిసేపు ఓటర్లతో హడావిడిగా కనిపించినా తర్వాత మాత్రం పోలింగ్ కేంద్రాలు వెలవెలబోతున్నాయి. వచ్చిన వాళ్లు వచ్చినట్లే ఓటు వేసి వెళ్లిపోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి.
Also Read: Telangana Election : ఇక అందరి చూపు మూడో తేదీ పైనే
హైదరాబాద్‌లో తొలి రెండు గంటల్లో కేవలం 4.57 శాతం మాత్రమే నమోదు అయింది. అతి తక్కువగా నాంపల్లిలో పోలింగ్ నమోదయింది. ప్రభుత్వం అన్ని సంస్థలకు సెలవులు ప్రకటించినా, సెలబ్రిటీలు వచ్చి ప్రచారం చేసినా హైదరాబాదీలు మాత్రం ఓటు హక్కును వినియోగించుకోవడానికి ముందుకు రావడం లేదు. మధ్యాహ్నం నుంచైనా పోలింగ్ శాతం పెరుగుతుందని అధికారులు భావిస్తున్నారు. హైదరాబాద్ లో అత్యల్పంగా నాంపల్లిలో 0.5 శాతం, రాజేంద్రనగర్ లో అత్యధికంగా 15 శాతం పోలింగ్ నమోదయ్యింది.
We’re now on WhatsApp. Click to Join.