ప్రేమ పేరుతో జంటలు (Lovers) రెచ్చిపోతున్నాయి. పబ్లిక్ గానే ముద్దులు పెట్టుకుంటున్నారు. చుట్టు పక్కల జనాలను ఏమాత్రం పట్టించుకోకుండా ఓ రేంజ్ లో చేస్తున్నారు. సినిమాలో హీరోహీరోయిన్స్ మాదిరిగా ప్రవర్తిస్తూ ప్రమాదకరంగా ప్రవర్తిస్తున్నారు. తాజాగా వైరల్ అవుతున్న వీడియో లో ఓ ప్రేమ జంట (Lovers) బైక్ పై రొమాన్స్ చేస్తూ రెచ్చిపోయారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో (Social media) చక్కర్లు కొడుతోంది.
ఓ యువకుడు మరో యువతిని తన బైక్ పెట్రోల్ ట్యాంక్పై ఎదురుగా కూర్చో పెట్టుకుని రైడ్ చేస్తున్న దృశ్యాలు వైరల్ అయ్యాయి. ఈ ఘటన విశాఖపట్నంలోని ప్రధాని రోడ్డులో చోటుచేసుకుంది. ద్విచక్ర వాహనం నడిపిన రెండు గంటల్లోనే స్టీలుప్లాంట్ పోలీసులు యువకుడు, యువతిని (Lovers) అరెస్ట్ చేసి.. వారిపై కేసు నమోదు చేసి వాహనాన్ని సీజ్ చేశారు. అనంతరం వారి తల్లిదండ్రులను పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చారు. వారిద్దరూ గాజువాక సమీపంలోని వెంపలినగర్, సమతానగర్‌కు చెందినవారిగా పోలీసులు గుర్తించారు.
ఇలాంటి చర్యలకు ఎవరు పాల్పడితే వాహనాలను సీజ్ చేయడమే కాకుండా కఠిన చర్యలు తీసుకుంటామని విశాఖపట్నం పోలీస్ కమిషనర్ సీహెచ్ శ్రీకాంత్ హెచ్చరించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ (Viral) అవుతుండటంతో నెటిజన్స్ ఘోరంగా రియాక్ట్ అయ్యారు. అరే ఎంట్రా ఇది.. వాట్ ఈజ్ దిస్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.