Viral Video: చిన్నారి చేసిన పనికి ప్రశంసలు కురిపిస్తున్న నెటిజన్స్.. వీడియో వైరల్?

చలికాలం మొదలయ్యింది. ఇప్పటికే కొన్ని ప్రదేశాలలో చలి వణికిస్తోంది. దీంతో ఉదయం సమయంలో ఇంట్లో నుంచి

  • Written By:
  • Publish Date - December 8, 2022 / 08:59 PM IST

చలికాలం మొదలయ్యింది. ఇప్పటికే కొన్ని ప్రదేశాలలో చలి వణికిస్తోంది. దీంతో ఉదయం సమయంలో ఇంట్లో నుంచి బయటికి రావాలి అంటేనే భయపడుతున్నారు. అయితే మనుషులు ఇళ్లలో తలుపులేసుకుని ఉంటారు. కానీ పక్షులు మూవీ జంతువులు పాపం చలికి వనకాల్సిందే. అయితే కొంతమంది మూగజీవులను అవి కూడా మనలాగే కదా అనుకుని వాటికి గూడును నిర్మించి వాటిని జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటారు. కుక్కలు, ఆవులు, గేదెలు లాంటి వాటికి కొన్ని కొందరు చిన్న పాక లేదా గుడిసె లాంటిది నిర్మిస్తూ ఉంటారు. అయితే తాజాగా అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆ వీడియోని చూసి ఆ వీడియోలో చిన్నారి చేసిన పనికి మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నారు. ఆ వీడియోలో ఏముందంటే.. ఒక చిన్న పిల్లవాడు చలికి తట్టుకోలేక చలిమంట ముందు కూర్చున్నాడు. ఆ పిల్లవాడు తో పాటు తన ఒడిలో ఒక మేక పిల్లను కూడా పడుకోబెట్టుకున్నాడు. ఆ మంట దగ్గర తాను చలి కాచుకుంటూనే తన చేతులతో ఆ మేక పిల్లకు కూడా వేడిని అందిస్తూ ఉన్నాడు. ఆ మేక పిల్ల కూడా ఆ పిల్లవాడు ఒళ్లో ఎంతో బాగా హాయిగా పడుకుని ఆ పిల్లవాడు అందించే వెచ్చదనాన్ని ఆస్వాదిస్తోంది.

 

ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఆ పిల్లాడు చేసిన పనికి నెటిజన్స్ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. మూగ జీవి పట్ల అంత చిన్న పిల్లవాడు చూపిస్తున్న ప్రేమ శ్రద్ధను చూసి చాలామంది ఆ పిల్ల వాడిని మెచ్చుకుంటున్నారు. ఆ వెచ్చదనానికి మేకపిల్ల కూడా అతని ఒడిలో హాయిగా పడుకుంది. ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. కొందరు ఈ వీడియోని సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తున్నారు.