Site icon HashtagU Telugu

Delhi Liquor Case: మనీష్ సిసోడియాకు మళ్ళీ నిరాశే..బెయిల్ పిటిషన్ రిజర్వ్

Delhi Liquor Case

Delhi Liquor Case

Delhi Liquor Case: ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన ఢిల్లీ మాజీ మంత్రి మనీష్ సిసోడియాకు ఇప్పట్లో బెయిల్ వచ్చే సూచనలు కనిపించడం లేదు. పలు మార్లు ఇప్పటికే ఆయన బెయిల్ పిటిషన్ నిరాకరణకు గురైంది. తాజాగా అతని బెయిల్ పిటిషన్ పై విచారించిన రూస్ అవెన్యూ కోర్టు తన తీర్పును రిజర్వ్ చేసింది. దీంతో మనీష్ సిసోడియాకు మళ్ళీ చుక్కెదురైంది.

ఢిల్లీ మద్యం కుంభకోణంలో సీబీఐ, ఈడీ కేసుల్లో మనీష్ సిసోడియా దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై ఢిల్లీలోని రూస్ అవెన్యూ కోర్టు తన తీర్పును రిజర్వ్ చేసింది. ఈ నెల 30న కోర్టు తన నిర్ణయాన్ని వెల్లడించనుంది. ప్రస్తుతం కస్టడీలో ఉన్న సిసోడియా ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు అనుమతి కోరారు. వచ్చే విచారణలో బెయిల్ పిటిషన్‌తో పాటు ఆయన అభ్యర్థనను కోర్టు పరిగణనలోకి తీసుకోనుంది.

We’re now on WhatsAppClick to Join

ప్రస్తుతము దేశ వ్యాప్తంగా లోకసభ ఎన్నికలు జరుగుతున్నాయి. నిన్న శుక్రవారం కొన్ని చోట్ల తొలిదశ పోలింగ్ పూర్తయింది. దీంతో మనీష్ సిసోడియా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటే ఆప్ కి మేలు జరుగుతుందని పార్టీ నేతలు భావిస్తున్నారు. అక్రమ కేసులో ఇరికించారంటూ సెంటిమెంటుతో ఓట్లు ఆడగొచ్చని నేతలు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో సిసోడియా తరుపు న్యాయవాది బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. సిసోడియా లిక్కర్ పాలసీ కేసులకు సంబంధించి న్యాయపరమైన చిక్కుల్లో ఉన్నప్పటికీ ఆయన బెయిల్ పిటిషన్‌ప తీర్పుపై ఆయన మద్దతుదారులు మరియు విమర్శకులు సైతం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Also Read: Mutton Chicken Shops : రేపు మటన్, చికెన్ షాపులన్నీ బంద్.. ఎందుకంటే ..?