CM Revanth Reddy : గత పదేళ్ల పాలనపై చర్చిద్దాం..చర్చకు సిద్ధమా?: సీఎం రేవంత్‌రెడ్డి

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి భూమిపూజ చేసుకున్నామని.. పదేళ్లుగా పాలమూరు జిల్లా ఎందుకు నీళ్లు రాలేదు.. పాలమూరులో ఎందుకు పాడి పంటలు కనిపించలేదని ప్రశ్నించారు.

Published By: HashtagU Telugu Desk
Let's discuss the governance of the last ten years..are we ready for discussion?: CM Revanth Reddy

Let's discuss the governance of the last ten years..are we ready for discussion?: CM Revanth Reddy

CM Revanth Reddy : నారాయణపేటలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. పేదవాడి ఆత్మగౌరవం ఇందిరమ్మ ఇండ్లు .. అందుకే రాష్ట్రవ్యాప్తంగా ప్రతీ నియోజకవర్గానికి 3500 ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. ఇవాళ ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి భూమిపూజ చేసుకున్నామని.. పదేళ్లుగా పాలమూరు జిల్లా ఎందుకు నీళ్లు రాలేదు.. పాలమూరులో ఎందుకు పాడి పంటలు కనిపించలేదని ప్రశ్నించారు.

Read Also: Hathras Stampede : తొక్కిసలాట ఘటన.. భోలే బాబాకు క్లీన్‌ చిట్‌

పదేళ్లు సీఎంగా ఉన్న కేసీఆర్‌ పాలమూరు ప్రాజెక్టులను ఎందుకు పూర్తి చేయలేదు. అంతకు ముందు ఎంపీగా గెలిపిస్తే.. ఏ నాడూ పాలమూరు గురించి పార్లమెంట్‌లో ప్రస్తావించలేదు. తెలంగాణ సాధించుకున్న తర్వాత కూడా ఈ జిల్లాకు న్యాయం జరగలేదు. పదేళ్లలో పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తి చేసి ఉంటే ఈరోజు చంద్రబాబుతో పంచాయితీ ఉండేది కాదు. వైఎస్‌ఆర్‌, జగన్‌ పోతిరెడ్డిపాడు ద్వారా కృష్ణా నీళ్లు రాయలసీమకు తరలించుకుపోతుంటే కేసీఆర్‌ నోరెత్తలేదు. నా మీద పగతో మక్తల్‌-నారాయణపేట-కొడంగల్‌ ప్రాజెక్టును పక్కన పడేశారు. గతంలో కొందరు సీఎంలు పాలమూరు పేరు చెప్పి రాజకీయం చేశారు కానీ, జిల్లాకు చేసిందేమీ లేదు. భీమ, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్‌, సంగంబండం, కల్వకుర్తి ప్రాజెక్టుల పదేళ్లలో ఎందుకు పూర్తి చేయలేదు.

ప్రతిపక్ష నేతగా కేసీఆర్‌, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రిగా కిషన్‌రెడ్డి చర్చకు వస్తే ముఖ్యమంత్రిగా నేను సిద్ధం. గత పదేళ్ల పాలనపై చర్చిద్దాం.. పదేళ్లలో ఏమీ చేయని వాళ్లు ఏడాదిలోనే కాంగ్రెస్‌ ఏమీ చేయలేదని అంటున్నారు. పాలమూరు జిల్లాలో ప్రాజెక్టులు, పరిశ్రమలను అడ్డుకోవాలని కుట్రలు చేస్తున్నారు. మోసగాళ్ల మాటలు విని భూసేకరణను అడ్డుకోవద్దు. భూమి కోల్పోయిన వారికి మంచి పరిహారం ఇచ్చి న్యాయం చేసే బాధ్యత నాది అని సీఎం అన్నారు. దేశంలో ఎక్కడాలేని విధంగా బీసీ కులగణన నిర్వహించామని.. ముప్ఫై ఏళ్లుగా పరిష్కారం కానీ ఎస్సీ ఉపకులాల సమస్యకు పరిష్కారం చూపామన్నారు. ఇవన్నీ కేసీఆర్‌కు కళ్లకు కనిపించడంలేదా అని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.

Read Also: Delhi CM Salary: సీఎం రేఖా గుప్తా జీతం ఎంత‌? ఎలాంటి సౌకర్యాలు అందుబాటులో ఉంటాయో తెలుసా?

 

 

  Last Updated: 21 Feb 2025, 06:25 PM IST