Warangal Rains: వరంగల్ లోని బ్యూటిఫికేషన్ ప్రాజెక్ట్ కు గండి

తెలంగాణాలో గత కొద్దీ రోజులుగా కురిసిన వర్షాల కారణంగా వరంగల్ అత్యంత ప్రభావితమైంది. వరంగల్ లోని నదికి గండి పడటంతో స్థానిక ప్రాంతాలు ముంపుకు గురయ్యాయి

Published By: HashtagU Telugu Desk
Warangal

New Web Story Copy (96)

Warangal Rains: తెలంగాణాలో గత కొద్దీ రోజులుగా కురిసిన వర్షాల కారణంగా వరంగల్ అత్యంత ప్రభావితమైంది. వరంగల్ లోని నదికి గండి పడటంతో స్థానిక ప్రాంతాలు ముంపుకు గురయ్యాయి. స్మార్ట్ సిటీ మిషన్‌లో భాగంగా చేపట్టిన బ్యూటిఫికేషన్ ప్రాజెక్ట్ లో 10 నుంచి 15 అడుగుల మేర కరకట్ట తెగిపోవడంతో పక్కనే ఉన్న పోతన నగర్, రాజీవ్ కాలనీ, సరస్వతి కాలనీలు జలమయమయ్యాయి. దీంతో పోలీసులు, మున్సిపల్ అధికారులు సమన్వయంతో సహాయక చర్యలు చేపట్టారు. ప్రజలను అప్రమత్తం చేసి సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

వరంగల్ భారీగా వర్షపాతం నమోదైంది. గత ఆరు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు సరస్సు ,వాగులు పొంగి పొర్లుతున్నాయి. ఈ క్రమంలో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మంత్రి కె.టి. రామారావు హైదరాబాద్ నుంచి అధికారులతో పరిస్థితిని సమీక్షించారు.

Also Read: Happy Birthday Sonu : 5వేలతో ముంబైకి వచ్చి.. రియల్ హీరోగా ఎదిగిన సోనూ సూద్

  Last Updated: 30 Jul 2023, 10:28 AM IST