LK Advani Turns 96: అద్వానీకి బీజేపీ అగ్ర నేతల జన్మదిన శుబకాంక్షలు

మాజీ ఉప ప్రధాని, బీజేపీ మాజీ అధ్యక్షుడు ఎల్ కే అద్వానీ బుధవారం 96వ ఏట అడుగుపెట్టారు. అద్వానీ పుట్టినరోజు సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీతో పాటు పలువురు సీనియర్ నేతలు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఎల్‌కె అద్వానీ మన దేశాన్ని బలోపేతం చేసే దిశగా సేవలు అందించారని కొనియాడారు.

Published By: HashtagU Telugu Desk
Bharat Ratna

L K Advani Turns 96

LK Advani Turns 96: మాజీ ఉప ప్రధాని, బీజేపీ మాజీ అధ్యక్షుడు ఎల్ కే అద్వానీ బుధవారం 96వ ఏట అడుగుపెట్టారు. అద్వానీ పుట్టినరోజు సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీతో పాటు పలువురు సీనియర్ నేతలు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఎల్‌కె అద్వానీ మన దేశాన్ని బలోపేతం చేసే దిశగా సేవలు అందించారని కొనియాడారు. అతని దార్శనిక నాయకత్వం జాతీయ ప్రగతిని మరియు ఐక్యతను పెంపొందించింది. ఆయన మంచి ఆరోగ్యంతో పాటు దీర్ఘాయుష్షు పొందాలని కోరుకుంటున్నాను అని ప్రధాని నరేంద్ర మోదీ ట్విట్టర్ ఎక్స్ లో పోస్ట్ పెట్టారు.

ఎల్‌కె అద్వానీ తన అవిరామ కృషి మరియు సంస్థాగత నైపుణ్యాలతో బిజెపిని ముందుకు నడిపించారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా కొనియాడారు. ఈ సందర్భంగా అద్వానీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అదేవిధంగా అద్వానీ ఇంటికి వెళ్లిన మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అద్వానీనికలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. కేంద్ర మంత్రి, బీజేపీ మాజీ అధ్యక్షుడు నితిన్ గడ్కరీ కూడా అద్వానీకి శుభాకాంక్షలు తెలిపారు.మీరు ఆరోగ్యంగా ఉండాలని, ఆయురారోగ్యాలతో ఉండాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను అని గడ్కరీ తెలిపారు. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కూడా అద్వానీకి మంచి ఆరోగ్యం మరియు దీర్ఘాయువు కోసం ప్రార్థించారు. అతను భారత రాజకీయాలకు ప్రధాన స్తంభంగా నిలిచారని మరియు బిజెపికి గొప్ప బలాన్ని అందించారని కొనియాడారు.

అద్వానీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా. దేశానికి, బీజేపీ కార్యకర్తలందరికీ స్ఫూర్తిదాయకమని చెప్పారు. కేంద్ర మంత్రులు ఎస్ జైశంకర్, నిర్మలా సీతారామన్, భూపేందర్ యాదవ్, ఇతర బీజేపీ నేతలు కూడా అద్వానీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

Also Read: BRS Party Fund: ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు ఒక్కొక్కరికి 40 లక్షల చెక్కులు

  Last Updated: 08 Nov 2023, 05:27 PM IST