Krishna River : కృష్ణా నది మరోసారి సుడిగుండాల్లా ప్రవహిస్తూ ఆ పరిసర ప్రాంతాలకు వరద ఉధృతిని తీసుకువస్తోంది. ఈ వరదల నేపథ్యంలో కృష్ణా బేసిన్‌లోని అన్ని ప్రధాన జలాశయాల్లో గేట్లు ఎత్తి నీటిని దిగువ ప్రాంతాలకు విడుదల చేస్తున్నారు. ఈ క్రమంలో జూరాల ప్రాజెక్ట్ వద్ద భారీ వరద కొనసాగుతుండగా, అధికారులు ఆ ప్రాజెక్ట్ యొక్క 6 గేట్లను తెరిచి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం జూరాలకి ఇన్‌ఫ్లో 71,713 క్యూసెక్కులు ఉండగా, ఔట్‌ఫ్లో 76,667 క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటిమట్టం 1045 అడుగులు కాగా, ప్రస్తుతం 1043.865 అడుగుల నీటిమట్టంతో ఉంది. జూరాల యొక్క పూర్తి సామర్థ్యం 9.657 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 8.949 టీఎంసీల నీరు నిల్వగా ఉంది. పైగా ఎగువ, దిగువ విద్యుత్ కేంద్రాల్లో 11 యూనిట్ల ద్వారా విద్యుత్ ఉత్పత్తి కొనసాగిస్తున్నారు.
Pawan Kalyan : అమరావతికి రైల్వే లైన్..స్పందించిన ఏపీ డిప్యూటీ సీఎం
ఇక శ్రీశైలం జలాశయం కూడా విస్తారమైన వరద ఉధృతిని ఎదుర్కొంటోంది. వరద పరిస్థితుల దృష్ట్యా, అధికారులు జలాశయానికి 5 గేట్లను 10 అడుగుల మేర ఎత్తి భారీగా నీటిని దిగువ ప్రాంతాలకు విడుదల చేస్తున్నారు. ఇక్కడ ఇన్‌ఫ్లో 1,59,089 క్యూసెక్కులు ఉండగా, ఔట్‌ఫ్లో 2,07,820 క్యూసెక్కులుగా ఉంది. జలాశయం మొత్తం 885 అడుగుల నీటిమట్టాన్ని చేరుకుని పూర్తిగా నిండిపోయింది. పూర్తి నిల్వ సామర్థ్యం 215.8070 టీఎంసీలు కాగా, ప్రస్తుత నిల్వ 215.8070 టీఎంసీలకే చేరింది. శ్రీశైలం కుడి గట్టు, ఎడమ గట్టు జల విద్యుత్ కేంద్రాల్లో కూడా విద్యుత్ ఉత్పత్తి కొనసాగిస్తున్నారు.
అలాగే శ్రీశైలం డ్యామ్ నుంచి పెద్ద స్థాయిలో నీటి విడుదలతో నాగార్జున సాగర్ ప్రాజెక్టుకూ వరద ప్రవాహం చేరుతోంది. ఈ వరద కారణంగా నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ వద్ద 22 క్రస్ట్ గేట్లు ఎత్తి నీటిని దిగువ ప్రాంతాలకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టుకు ఇన్‌ఫ్లో 2,08,863 క్యూసెక్కులు కాగా, ఔట్‌ఫ్లో 2,25,463 క్యూసెక్కులుగా ఉంది. ప్రస్తుతం ప్రాజెక్ట్ నీటిమట్టం 589.70 అడుగులు ఉండగా, పూర్తి స్థాయి నీటిమట్టం 590 అడుగులుగా ఉంది. ప్రాజెక్టు సామర్థ్యం 312 టీఎంసీలుగా ఉండగా, ప్రస్తుత నిల్వ 311.4886 టీఎంసీల నీరు ఉన్నది. దిగువ ప్రాంతాలకు నీటిని విడుదల చేయడంతో పాటు పంట కాలువలకు కూడా నీరు అందిస్తున్నామని అధికారులు వెల్లడించారు.
Bomb Threat : తిరుపతిలోని హోటళ్లకు బాంబు బెదిరింపులు.. రంగంలోకి దిగిన పోలీసులు