Site icon HashtagU Telugu

Koneru Konappa : కోనేరు కోనప్ప యూటర్న్..చివరి వరకూ కాంగ్రెస్‌లోనే కొనసాగుతా.. !

Koneru Konappa U-turn.. Will continue in Congress till the end.. !

Koneru Konappa U-turn.. Will continue in Congress till the end.. !

Koneru Konappa : సిర్ఫూర్ కాగజ్ నగర్ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప యూటర్న్ తీసుకున్నారు. పార్టీ ముఖ్య నేతలతో కలిసి ఈరోజు ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. అనంతరం ఆయన పార్టీ మార్పుపై వివరణ ఇచ్చారు. తాను కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి, బీఆర్ఎస్‌లో చేరబోతున్నట్లు జరిగిన ప్రచారాన్ని ఖండించారు. తాను చివరి వరకూ కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతానని అన్నారు. అయితే కాంగ్రెస్ పార్టీని వీడకుండా సీఎం రేవంత్ రెడ్డి బుజ్జగించడంతో కోనప్ప తన మనసు మార్చుకుని కాంగ్రెస్ లో కొనసాగేందుకు నిర్ణయించుకున్నట్లుగా సమాచారం.

Read Also: AP Cabinet : ఈ నెల 28న ఏపీ కేబినెట్ భేటీ..!

సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో గతేడాది మార్చి 6న కోనప్ప కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. నియోజకవర్గ కాంగ్రెస్ రాజకీయాల్లో ముదిరిన విబేధాలు..తను రూ.75 కోట్లతో మంజూరు చేయించిన ఫ్లై ఓవర్ ను క్యాన్సిల్ చేయడం వంటి అంశాలతో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు ఆయన ఇక నుంచి స్వతంత్రంగా ఉంటానని ప్రకటించారు. ఇంతలోనే యూటర్న్ తీసుకుని సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. ఇక, కోనేరు కోనప్ప కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి, బీఆర్ఎస్‌లో చేరనున్నట్లు నిన్న జోరుగా ప్రచారం సాగింది. అయితే, ఈరోజు ఆయన ముఖ్యమంత్రిని కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది.

ఇకపోతే.. 2014 ఎన్నికల్లో కోనేరు కోనప్ప బీఎస్సీ నుంచి పోటీ చేసి నాటి బీఆర్ఎస్ అభ్యర్థి కావేటి సమ్మయ్యపై విజయం సాధించారు. ఎన్నికల తర్వాత అధికార బీఆర్ఎస్ పార్టీలో చేరారు. అనంతరం 2018లో బీఆర్ఎస్ నుంచి పోటీ చేసి గెలిచారు. 2023లో జరిగిన ఎన్నికల్లో మరోసారి బీఆర్ఎస్ నుంచి బరిలోకి దిగి బీజేపీ అభ్యర్థి పాల్వాయి హరీశ్ చేతిలో ఓటమిపాలయ్యారు. ఇదే ఎన్నికల్లో తనపై బీఎస్సీ నుంచి పోటీ చేసిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ను కేసీఆర్ బీఆర్ఎస్ లో చేర్చుకోవడంతో అసంతృప్తికి గురైన కోనప్ప కాంగ్రెస్ గూటికి చేరారు.

Read Also: Toothpaste: ఏ వయస్సులో పిల్లలు టూత్‌పేస్ట్ వాడాలి?