మాజీ మంత్రి, వైసీపీ నేత కొడాలి నాని(Kodali Nani)కి గుండెపోటు (Heart Attack) రావడంతో హైదరాబాద్‌లోని ఏఐజీ (ఆసియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజీ) ఆసుపత్రికి తరలించారని తాజా సమాచారం అందుతోంది. ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని హాస్పటల్ (Hospital) వర్గం చెపుతుంది. ప్రస్తుతం ఆయనను ఐసీయూలో చేర్చి ప్రత్యేక పర్యవేక్షణలో ఉంచారు.
కొడాలి నాని గత కొంతకాలంగా రాజకీయ కార్యక్రమాల్లో తక్కువగా కనిపిస్తున్నారు. ఆరోగ్య సమస్యల కారణంగా ఆయన రాజకీయాలకు కొంతకాలంగా దూరంగా ఉన్నారని సోషల్ మీడియాలో పలు వార్తలు వచ్చాయి. తాజాగా గుండెపోటు రావడంతో వైఎస్ఆర్‌సీపీ శ్రేణుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. పార్టీ శ్రేణులు, ఆయన అభిమానులు ఆయన ఆరోగ్య పరిస్థితిపై అధికారిక సమాచారం కోసం ఎదురుచూస్తున్నారు.
CBI Raids : మహదేవ్ బెట్టింగ్ యాప్ స్కాం.. మాజీ సీఎం ఇంట్లో సీబీఐ రైడ్స్
కొడాలి నాని ఆరోగ్య పరిస్థితిపై ఆస్పత్రి వర్గాలు పూర్తి వివరాలు అందజేయలేదు. అయితే ఆయన పరిస్థితి నిలకడగానే ఉందనే వార్తలు వస్తున్నాయి. వైద్య నిపుణుల పర్యవేక్షణలో ఉండటంతో త్వరలోనే మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఆయన త్వరగా కోలుకోవాలని అభిమానులు, వైఎస్ఆర్‌సీపీ శ్రేణులు ప్రార్థనలు చేస్తున్నారు.