Site icon HashtagU Telugu

Hyderabad: వామ్మో కిలాడీ లేడీ.. లిఫ్ట్ అడుగుతూ, డబ్బులు గుంజుతూ!

jail

jail

Hyderabad: రోడ్డు మీద వెళ్లే వారిని లిఫ్ట్ అడగడం.. వాహనంలో ఎక్కిన తర్వాత రేప్ చేసేందుకు ప్రయత్నం చేశావు అంటూ ఫిర్యాదు చేస్తా అని బెదిరించడం ఆ యువతికి అలవాటు. బెదిరింపులతో భారీగా డబ్బులు గుంజుతోంది. తాను అడ్వకేట్ అని.. తనకు అన్ని సెక్షన్లు తెలుసు అంటూ ఎదురుదాడి చేస్తుంటుంది. ఇటీవల జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ నుంచి kbr పార్క్ దాకా లిఫ్ట్ కావాలి అంటూ కారులో ఎక్కిన బాధితురాలు ఓ వ్యక్తిని బెదిరించింది.

ఇటీవల డ్రైవర్ పరమానంద ఈ యువతికి లిప్ట్ ఇచ్చాడు. మార్గమధ్యలోకి వెళ్లగానే అతనికి బెదిరించింది. డబ్బులు ఇవ్వాలంటూ బ్లాక్ మెయిల్ చేసింది. బట్టలు చించుకుని రేప్ కేసు పెడతా అంటూ అల్లరి చేసింది. దీంతో ఆ వ్యక్తి అడిగినంతా ఇచ్చినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో డ్రైవర్ జూబ్లీ హిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. Ipc 389 సెక్షన్ కింద కిలాడీ సయీదా నయీమా సుల్తానా(32)ను అరెస్ట్ చేశారు.  కిలాడీ లేడీ మీద నగర వ్యాప్తంగా పలు స్టేషన్లలో 17 కేసులు ఉన్నాయి. పలువురు అమాయకుల మీద కిలాడీ లేడీ కేసులు పెట్టినట్లు దర్యాప్తులో వెల్లడైంది.

Exit mobile version